Naga Chaitanya in Mass Role:
అక్కినేని కుటుంబానికి చిరకాలం గుర్తుండిపోయే సినిమా ‘మనం’. ఆ సినిమాలో కింగ్ అక్కినేని నాగార్జున, యువ సామ్రాట్ నాగ చైతన్య కలిసి నటించారు. తండ్రీ కొడుకుల బంధాన్ని చక్కగా పండించి అందరినీ మెప్పించారు. ప్రస్తుతం ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాకు ప్రీక్వెల్‌గా రాబోతోన్న ‘బంగార్రాజు’ చిత్రంతో ఈ ఇద్దరూ మరో సారి మెస్మరైజ్ చేసేందుకు వస్తున్నారు. నాగ చైతన్య బర్త్ డే (నవంబర్ 23) సందర్బంగా టీజర్‌ను విడుదల చేయబోతోన్నారు కానీ అంత కంటే ముందుగానే ఈ రోజు నాగ చైతన్య పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.
చేతిలో కర్ర పట్టుకుని నాగ చైతన్య కనిపించడం, ఆ గెటప్, చేతికి బ్రాస్ లెట్ ఇలా అన్ని చూస్తుంటే పాత్ర మీద అందరికీ ఆసక్తి పెరిగిపోతోంది. రొమాన్స్, ఎమోషన్స్, అన్ని రకాల కమర్షియల్ అంశాలతో రాబోతోన్న ‘బంగార్రాజు’ లో నాగార్జున సరసన రమ్యకృష్ణ; నాగ చైతన్యకు జోడిగా కృతి శెట్టి కనిపించనున్నారు. నాగలక్ష్మీగా కృతి శెట్టి పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను నాగ చైతన్య విడుదల చేయగా.. మంచి స్పందన వచ్చింది.
‘లడ్డుండా’ అనే పాట ఇప్పటికీ మార్మోగిపోతూనే ఉంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ పాటకు విశేష స్పందన లభించింది. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సత్యానంద్ స్క్రీన్ ప్లేను అందిస్తుండగా.. సినిమాటోగ్రఫర్‌గా యువరాజ్ పని చేస్తున్నారు. మైసూర్లో ప్రస్తుతం బంగార్రాజు షూటింగ్ జరుగుతోంది.