Sunday, March 15, 2026
Homeసినిమాచైతూ దృష్టి అంతా ఇప్పుడు 'కస్టడీ'పైనే! 

చైతూ దృష్టి అంతా ఇప్పుడు ‘కస్టడీ’పైనే! 

నాగచైతన్య హీరోగా ఎంట్రీ ఇచ్చి పుష్కర కాలం దాటిపోయింది. ఈ ప్రయాణంలో ఆయన చేసిన సినిమాల్లో కొన్ని హిట్లు కనిపిస్తాయి. కథల పరంగా .. పాత్రల పరంగా సాధ్యమైనంత వరకూ కొత్తగా కనిపించడానికే చైతూ ప్రయత్నిస్తూ వస్తున్నాడు. అయితే ఈ ప్రయత్నంలో ఆయన చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే సక్సెస్ అయ్యాడు. అయినా పట్టువదలకుండా ముందుకు వెళుతూనే ఉన్నాడు.

చైతూకి ప్రేమకథా చిత్రాల ద్వారా ఎక్కువ గుర్తింపు వచ్చింది. దాంతో ఆయన కొత్తదనం ఉండాలనే ఉద్దేశంతో యాక్షన్ సినిమాల దిశగా వెళ్లాడు. కానీ ఆయనకి యాక్షన్ సినిమాలు సెట్ కావనే విషయాన్ని ఆ సినిమాల ఫలితాలు చెప్పేశాయి. దాంతో ఆయన మళ్లీ ఫ్యామిలీ నేపథ్యంతో ముడిపడిన లవ్ స్టోరీస్ ను చేస్తూ వెళుతున్నాడు. ఈ రూట్లో ‘మజిలీ’ .. ‘లవ్ స్టోరీ’ హిట్ అయినప్పటికీ, ‘థ్యాంక్యూ’ పరాజయాన్ని చవిచూసింది.

ఈ మధ్యలో ‘బంగార్రాజు’ ఉన్నప్పటికీ, అందులో సక్సెస్ శాతం నాగ్ ఖాతాలోకి వెళుతుంది. ఈ నేపథ్యంలో చైతూ నుంచి వస్తున్న సినిమానే ‘కస్టడీ’. కోలీవుడ్లో డైరెక్టర్ గా ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న వెంకట్ ప్రభు ఈ సినిమాను రూపొందించాడు. ఇళయరాజా – యువన్ శంకర్ రాజా కలిసి పనిచేసిన సినిమా ఇది. మే 12వ తేదీన రానున్న ఈ సినిమాపైనే  చైతూ పూర్తి దృష్టిపెట్టాడు. ఆయన జోడీగా కృతి శెట్టి కనిపించనుండటం ఇది రెండోసారి. పోస్టర్స్ నుంచే ఆసక్తిని పెంచుతున్న ఈ సినిమా, చైతూకి కోలీవుడ్ నుంచి కూడా హిట్ తెస్తుందేమో చూడాలి.

Also Read : ‘కస్టడీ’ మూవీ టీజర్‌ డేట్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular