Sunday, January 19, 2025
Homeసినిమామ‌రో డైరెక్ట‌ర్ కి చైత‌న్య గ్రీన్సిగ్న‌ల్ ఇచ్చాడా?

మ‌రో డైరెక్ట‌ర్ కి చైత‌న్య గ్రీన్సిగ్న‌ల్ ఇచ్చాడా?

మ‌జిలీ, వెంకీ మామ‌, ల‌వ్ స్టోరీ, బంగార్రాజు.. ఇలా వ‌రుస‌గా స‌క్సెస్ సాధించిన నాగ‌చైత‌న్య ఇటీవ‌ల థ్యాంక్యూ మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. డిఫ‌రెంట్ ల‌వ్ స్టోరీగా రూపొందిన ఈ మూవీ ప్రేక్ష‌కుల‌ను ఏమాత్రం ఆక‌ట్టుకోలేక‌పోయింది. దీంతో తర్వాత  చేయ‌బోయే సినిమాల విష‌యంలో చాలా కేర్ తీసుకుంటున్నాడు చైతూ. ప్ర‌స్తుతం లాల్ సింగ్ చ‌డ్డా ప్ర‌మోష‌న్స్ కోసం ముంబైలో బిజీగా ఉన్నాడు.

నెక్ట్స్ కోలీవుడ్ డైరెక్ట‌ర్ వెంక‌ట్ ప్ర‌భుతో తెలుగు, త‌మిళ్ లో ఓ సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో నాగ‌చైత‌న్య ప‌వ‌ర్ ఫుల్ పోలీసాఫీస‌ర్ గా న‌టిస్తున్నాడు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటున్న ఈ మూవీని త్వ‌ర‌లో స్టార్ట్ చేయ‌నున్నారు. ఆ త‌ర్వాత సినిమాలు ప్ర‌క‌టించ‌క‌పోయినా నాగ‌చైత‌న్య డిజే టిల్లు డైరెక్ట‌ర్ విమ‌ల్ కృష్ణ‌తో ఓ సినిమా చేయ‌డానికి ఓకే చెప్పాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి.

లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే.. విమ‌ల్ కృష్ణ చెప్పిన స్టోరీని మ‌రోసారి విని గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ట‌. అందుక‌నే విమ‌ల్ కృష్ణ డీజే టిల్లు సీక్వెల్ ని డైరెక్ట్ చేయ‌డం లేదు. ప్ర‌స్తుతం విమ‌ల్ చైత‌న్య‌తో చేయ‌నున్న మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ స్టార్ట్ చేశాడ‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే ఈ మూవీని అఫిషియ‌ల్ గా అనౌన్స్ చేయ‌నున్నారు. మ‌రి.. డిజే టిల్లులో సిద్ధుని డిఫ‌రెంట్ గా చూపించిన విమ‌ల్ చైతుని ఎలా చూపిస్తాడో చూడాలి.

Also Read చైతూ మరో బాలీవుడ్ సినిమా చేస్తున్నారు

RELATED ARTICLES

Most Popular

న్యూస్