Thursday, March 19, 2026
Homeసినిమానాగచైతన్య కోరిక ఈసారైనా తీరుతుందా..?

నాగచైతన్య కోరిక ఈసారైనా తీరుతుందా..?

నాగచైతన్య ‘జోష్’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. నూతన దర్శకుడు వాసు వర్మ డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మించిన జోష్ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడింది. అయితే.. నాగచైతన్య నటుడుగా మాత్రం మెప్పించాడు. ఆతర్వాత ‘ఏమాయచేశావే’, ‘100 పర్సెంట్ లవ్’ చిత్రాలతో సక్సెస్ సాధించాడు. అప్పటి నుంచి నాగచైతన్య ప్రేమకథా చిత్రాలకు కరెక్ట్ గా సెట్ అవుతాడనే పేరు వచ్చింది. లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్నాడు. అయితే.. చైతన్యకు మాస్ సినిమాలు చేయడం అంటే ఇష్టం. మాస్ ఆడియన్స్ ని మెప్పించాలి.. అన్నిరకాల పాత్రలు చేయగలడు అనిపించుకోవాలి అనేది చైతు ఆలోచన.

అయితే.. మాస్ ని మెప్పించాలని చేసిన ‘దడ’, ‘బెజవాడ’, ‘యుద్దం శరణం’, ‘సవ్యసాచి’.. చిత్రాలు ఫెయిల్ అయ్యాయి. అప్పటి నుంచి రూటు మార్చి తనకు బాగా కలిసొచ్చిన లవ్ స్టోరీలు, ఫ్యామిలీ స్టోరీలు చేస్తున్నాడు. సక్సెస్ సాధిస్తున్నాడు. అయితే.. మాస్ ని మెప్పించాలనే ప్రయత్నం మాత్రం ఆపలేదు. లేటెస్ట్ గా వెంకట్ ప్రభుతో తెలుగు, తమిళ్ లో నాగచైతన్య ఓ భారీ చిత్రం చేస్తున్నారు. ఇందులో చైతన్య సరసన కృతిశెట్టి నటిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

ఇందులో నాగచైతన్య కానిస్టేబుల్ క్యారెక్టర్ లో కనిపించనున్నారు. నవంబర్ 23న నాగచైతన్య పుట్టినరోజు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ప్రీ లుక్, ఫస్ట్ లుక్ కు అనూహ్యమైన స్పందన వచ్చింది. ఈ సినిమా కాస్త యాక్షన్ తో ఉండే మాస్ మూవీనే. సమ్మర్ లో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అరవింద్ స్వామి, ప్రియమణి.. ఇలా భారీ తారాగణంతో ఈ సినిమా రూపొందుతోంది. మరి.. ఈ సినిమాతో అయినా నాగచైతన్య అందర్నీ ఆకట్టుకుని… మాస్ ని మెప్పిస్తాడేమో చూడాలి.

Also Read : నాగచైతన్య కోరిక ఈసారైనా తీరుతుందా..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular