Wednesday, March 11, 2026
Homeసినిమాచైతూ - చందూ మూవీ ఎప్పుడు..?

చైతూ – చందూ మూవీ ఎప్పుడు..?

అక్కినేని నాగచైతన్య ‘కస్టడీ’ తీవ్రంగా నిరాశపరిచడంతో అప్పటినుంచి కొత్త సినిమాని ప్రకటించలేదు. ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మాతగా చందు మొండేటితో నాగచైతన్య సినిమా అని వార్తలొచ్చాయి. ఇది  భారీ బడ్జెట్ తో,  ఓ విభిన్న ప్రేమకథా  చిత్రంగా ఉంటుందని తెలిసింది.

నాగార్జున పుట్టినరోజైన ఆగష్టు 29న ఈ భారీ చిత్రాన్ని ప్రకటించనున్నారని తెలిసింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఈసారి నాగచైతన్య ఖచ్చితంగా సక్సెస్ సాధించాల్సిన పరిస్థితి. అందుకనే స్క్రిప్ట్ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నారట. హీరోయిన్ గా ఇంకా ఎవర్నీ ఫైనల్ చేయలేదు కానీ.. కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్ పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఇందులో చైతన్య ఫిషర్ మేన్ క్యారెక్టర్ చేయనున్నాడు. శ్రీకాకుళం, వైజాగ్, గుజరాత్ లలో షూటింగ్ చేయనున్నారు.

చైతూ – చందూ కలిసి ప్రేమమ్, సవ్యసాచి చిత్రాలు చేశారు. ఇందులో ప్రేమమ్ సక్సెస్ కాగా, సవ్యసాచి ఫ్లాప్ అయ్యింది. చందూ ‘కార్తికేయ 2’ తో పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ సాధించాడు. అందుచేత ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా ప్లాన్ చేస్తున్నారని… బడ్జెట్ విషయంలో కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్ తోనే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని తెలిసింది. మరి.. ఈ సినిమాతో అయినా చైతూ సక్సెస్ సాధిస్తాడేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular