Friday, March 20, 2026
Homeసినిమాచైతన్య నెక్ట్స్ మూవీ స్టోరీ ఇదే

చైతన్య నెక్ట్స్ మూవీ స్టోరీ ఇదే

నాగచైతన్య నటించిన ‘కస్టడీ’ చిత్రం ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. దీంతో నెక్ట్స్ మూవీ ఎవరితో..? ఎప్పుడు..? అనేది ఆసక్తిగా మారింది. చందు మొండేటి డైరెక్షన్ లో నాగచైతన్య సినిమా చేయనున్నాడు. ఈ చిత్రాన్ని జీఏ 2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించనున్నారు. అయితే.. 2018 సినిమా తెలుగులో గీతా సంస్థ ద్వారా రిలీజైంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బన్నీ వాసు ఇచ్చిన ఇంటర్ వ్యూలో చైతన్యతో సినిమా చేయనున్నట్టుగా ప్రకటించారు. దీంతో ఇప్పటి వరకు ప్రచారంలో ఉన్న ఈ ప్రాజెక్ట్ కన్ ఫర్మ్ అయ్యింది.

ఇక అసలు విషయానికి వస్తే.. ఈ సినిమా సముద్రం బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని.. ఇది కొన్ని యదార్థ సంఘటనలు ఆధారంగా తయారు చేసిన కథ అని చెప్పారు. అంతే కాకుండా ఈ సినిమాలో చైతన్య బోటు డ్రైవర్ గా నటిస్తాడని అన్నారు. చైతన్య ఎక్కువ శాతం గళ్ల చొక్కా, చారల పంచతో కనిపించనున్నాడని.. ఇప్పటి వరకు ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు. దీంతో ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ఈ సినిమా పై మరింత ఆసక్తి ఏర్పడింది. ఈ చిత్రానికి దాదాపు 60 కోట్ల బడ్జెట్ అవుతుందని సమాచారం.

చైతన్య 60 కోట్ల బడ్జెట్ తో సినిమా చేయలేదు. ఇదే చైతన్య కెరీర్ లో హయ్యస్ట్ బడ్జెట్ మూవీ అవుతుతుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. జులై నుంచి ఈ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో నటించే హీరోయిన్ ఎవరు అనేది ఇంకా కన్ ఫర్మ్ కాలేదు. అంతా సెట్ అయిన తర్వాత పూర్తి వివరాలతో ఈ సినిమాని ప్రకటించనున్నారు. మరి.. సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న నాగచైతన్య ఈ సినిమాతో మళ్లీ ట్రాక్ లోకి వస్తాడేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular