Saturday, November 23, 2024
Homeసినిమానాగచైతన్య రిస్క్ చేయనున్నాడా..?

నాగచైతన్య రిస్క్ చేయనున్నాడా..?

అక్కినేని నాగచైతన్య కొత్త తరహా సినిమాలు చేయాలని.. ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేయాలని తపిస్తుంటాడు. కథ నచ్చితే ఎలాంటి సినిమా చేయడానికైనా రెడీ అంటుంటాడు. లవ్ స్టోరీస్, ఫ్యామిలీ స్టోరీస్ తో మెప్పించిన చైతన్యకి మాస్ మూవీ చేసి మెప్పించాలనేది కోరిక. అందుకనే మాస్ సినిమా తనకు కలిసిరాకపోయినా ప్రయత్నం మాత్రం ఆపకుండా ప్రయత్నం చేస్తూనే ఉంటుంటాడు. ఇటీవల కస్టడీ అంటూ మాస్ సినిమా చేశాడు. ఈ మాస్ యాక్షన్ మూవీ ప్రేక్షకుల్ని ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. చైతన్యకు మరో ఫ్లాప్ వచ్చింది.

ఇప్పుడు చందు మొండేటి డైరెక్షన్ లో ఓ విభిన్న ప్రేమకథా చిత్రం చేస్తున్నాడు. జీఏ 2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలో ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల సామజవరగమన అనే సినిమాతో సక్సెస్ సాధించిన రామ్ అబ్బరాజు నాగచైతన్యకు ఓ కథ చెప్పాడట. ఆ కథ విడాకుల నేపధ్యంలో సాగే కథ అట. ఈ కథ నాగచైతన్యకు బాగా నచ్చిందట. కాకపోతే కొన్ని కరెక్షన్స్ చెప్పాడట. ఆ కరెక్షన్స్ చేసుకుని రమ్మన్నాడట.

అయితే.. ఈ న్యూస్ తెలిసినప్పటి నుంచి చైతన్య రిస్క్ చేస్తున్నాడని టాక్ వినిపిస్తుంది. కారణం ఏంటంటే..  చైతన్య విడాకుల నేపధ్యంలో సినిమా చేస్తే.. తన పర్సనల్ స్టోరీ గుర్తొచ్చే అవకాశం ఉంది. నాగచైతన్య, సమంత ప్రేమించి పెళ్లి చేసుకుని విడిపోవడంతో ఎవరు విడాకులు తీసుకుంటున్నారన్నా.. చై – సామ్ విడాకులు గుర్తొస్తున్నాయి. ఇప్పుడు నాగచైతన్యే విడాకుల నేపథ్యంలో సినిమా చేస్తే.. మరోసారి వార్తల్లోకి రావడం ఖాయం. ఇంకా చెప్పాలంటే.. ఇలాంటి హాట్ టాపిక్ పై సినిమా చేయడం అంటే రిస్కే. మరి.. నాగచైతన్య తెలిసి తెలిసి ఈ రిస్క్ చేస్తారా..? లేదా..? క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్