Saturday, March 14, 2026
HomeసినిమాCustody Press Meet: 'కస్టడీ' ఓ కొత్త లేయర్ సర్ప్రైజ్ చేస్తుంది: నాగ చైతన్య

Custody Press Meet: ‘కస్టడీ’ ఓ కొత్త లేయర్ సర్ప్రైజ్ చేస్తుంది: నాగ చైతన్య

నాగ చైతన్య, వెంకట్ ప్రభు ల తెలుగు-తమిళ ద్విభాషా ప్రాజెక్ట్ ‘కస్టడీ’. కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై భారీ నిర్మాణ విలువలు, సాంకేతిక ప్రమాణాలతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ని పవన్‌కుమార్‌ సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదల టీజర్ గ్లింప్స్ ఫస్ట్ సింగిల్ కి ట్రెమండస్ వచ్చింది. కస్టడీ మే 12న థియేటర్లలో రానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రెస్ యూనిట్ నిర్వహించింది.

నాగచైతన్య మాట్లాడుతూ.. టీజర్ కి తెలుగు, తమిళ్ ప్రేక్షకుల నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ మే 5న విడుదలౌతుంది. ఒక మామూలు కానిస్టేబుల్ చేతికి నిజం అనే ఆయుధం చేతిలో వుంటే తను ఎంత దూరం వెళ్తాడనే పాయింట్ వెంకట్ ప్రభు గారు చెప్పినప్పుడు చాలా నచ్చింది. ఈ కథకు నేను ఎందుకు అని అడిగినపుడు.. లవ్ స్టొరీలో నా నటన నచ్చిందని, ఈ పాత్రకు నేను సరిగ్గా సరిపోతానని చెప్పారు. నాకు ఎప్పటి నుంచో తమిళ్ లో సినిమా చేయాలనే ఉండేది. వెంకట్ ప్రభు గారితో అక్కడ లాంచ్ కావడం, ఆయన ఇక్కడకి పరిచయం కావడం చాలా ఆనందంగా వుంది. కథ విన్నప్పుడు ఆయన్ని గట్టిగా కౌగిలించుకున్నాను. సినిమా చూసినప్పుడు కూడా అదే ఫీలింగ్ కలిగింది. అరవింద్ స్వామి, ప్రియమణి, శరత్ కుమార్ గారితో పని చేయడం గొప్ప అనుభవం. ఇళయరాజా, యువన్ శంకర్ రాజాలతో పని చేయడం నా కల నెరవేరినట్లయింది. ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీపడకుండా భారీ నిర్మించిన నిర్మాతలకు కృతజ్ఞతలు. కస్టడీ లో చాలా లేయర్లు వున్నారు. ప్రతి పది నిమిషాలకు ఒక లేయర్ రివిల్ అవుతూ వుంటుంది. కృతితో రెండో సినిమా చేయడం ఆనందంగా వుంది. మే 12న సినిమా మీ ముందుకు వస్తోంది. మీ అందరి రియాక్షన్ చూడటానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను” అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular