Sunday, January 19, 2025
Homeసినిమానెక్ట్స్ మూవీస్ పై క్లారిటీ ఇచ్చిన నాగ‌చైత‌న్య‌

నెక్ట్స్ మూవీస్ పై క్లారిటీ ఇచ్చిన నాగ‌చైత‌న్య‌

అక్కినేని నాగ‌చైత‌న్య న‌టించిన లేటెస్ట్ మూవీ థ్యాంక్యూ. ఈ చిత్రానికి మ‌నం ఫేమ్ విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే.. ఈ మూవీ త‌ర్వాత నాగ‌చైత‌న్య ఎవ‌రితో సినిమా చేయ‌నున్నాడు..? ప‌ర‌శురామ్ తో సినిమా ఉంటుందా..?  ఉండ‌దా..? ఇంకా ఏ సినిమాలైనా క‌మిట్ అయ్యాడా..? ఇలా కొన్ని డౌట్స్ ఉండేవి. వాట‌న్నింటికి క్లారిటీ ఇచ్చాడు నాగ‌చైత‌న్య‌.

ఇంత‌కీ ఏం చెప్పాడంటే “కోలీవుడ్ డైరెక్ట‌ర్ వెంక‌ట్ ప్ర‌భు డైరెక్ష‌న్ లో తెలుగు, త‌మిళ్ లో ఓ చిత్రం చేస్తున్నా,  ఈ మూవీ షూటింగ్ త్వ‌ర‌లో స్టార్ట్ కానుంది. ఇందులో పోలీస్ పాత్ర చేస్తున్నా. దీన్ని మార్చిలోపు రిలీజ్ చేయాల‌నేది ప్లాన్. ఇక ప‌ర‌శురామ్ తో సినిమా విష‌యానికి వ‌స్తే.. ఇంకా క‌థ పూర్తిగా చెప్ప‌లేదు. ఓ పాయింట్ అనుకున్నాం. దీని పై ప‌ర‌శురామ్ వ‌ర్క్ చేస్తున్నాడు. త్వ‌ర‌లో ఫుల్ స్టోరీ చెబుతాన్నాడు. ఇవి కాకుండా.. డైరెక్ట‌ర్ త‌రుణ్ భాస్క‌ర్ ఓ లైన్ చెప్పాడు. డిఫ‌రెంట్ గా ఉన్న ఆ స్టోరీ లైన్ న‌చ్చింది. దీని పై వ‌ర్క్ చేస్తున్నాడు…. బాలీవుడ్ విషయానికి వ‌స్తే.. లాల్ సింగ్ చ‌డ్డాలో న‌టించే అవ‌కాశం అనుకోకుండా వ‌చ్చింది. ఈ సినిమాతో బాలీవుడ్ లో ఎంతవ‌ర‌కు యాక్స‌ప్టె చేస్తారో చూడాలి. బాలీవుడ్ లో మ‌రో మూవీ ఒప్పుకోలేదు. ప్ర‌స్తుతం నా  దృష్టంతా  తెలుగు సినిమాల పైనే ఉంది” అని చెప్పారు నాగ‌చైత‌న్య‌.

Also Read : నాగ‌చైత‌న్య మూవీకి మెగాస్టార్ ప్ర‌చారం 

RELATED ARTICLES

Most Popular

న్యూస్