Friday, September 20, 2024
Homeసినిమానాగ చైతన్య ‘థ్యాంక్యూ’ 8 రోజుల్లో పూర్తి

నాగ చైతన్య ‘థ్యాంక్యూ’ 8 రోజుల్లో పూర్తి

అక్కినేని నాగచైతన్య, ‘మనం’ ఫేమ్ విక్రమ్ కుమార్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం థ్యాంక్యూ. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇటీవల ఇటలీ షెడ్యూల్ పూర్తి చేసుకుని టీమ్ ఇండియా చేరుకున్నారు. ఇందులో నాగచైతన్య మహేష్ బాబు అభిమానిగా నటిస్తుండడం విశేషం. లాక్ డౌన్ కారణంగా ఈ మూవీ షూటింగ్ కి బ్రేక్ పడింది. అయితే… ఇటీవల ఈ సినిమా గురించి డైరెక్టర్ విక్రమ్ కుమార్ స్పందిస్తూ.. ఎనిమిది రోజులు షూటింగ్ చేస్తే థ్యాంక్యూ మూవీ పూర్తవుతుందని చెప్పారు. జులైలో మిగిలిన షూటింగ్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేస్తామని, ఆగష్టుకి ఈ సినిమా ఫస్ట్ కాపీ రెడీ చేస్తానని విక్రమ్ కుమార్ చెప్పారు. బి.వి.ఎస్. రవి కథ అందించిన ఈ చిత్రానికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.తమన్ సంగీతం అందించారు.

ఇక నాగచైతన్య ‘లవ్ స్టోరీ’ విషయానికొస్తే… గత సంవత్సరమే విడుదల కావాల్సి ఉంది, కానీ కరోనా కారణంగా ఆగింది. ఈ ఏడాది ఏప్రిల్ 16న రిలీజ్ చేయాలనుకున్నారు….. కరోనా సెకండ్ వేవ్ కారణంగా థియేటర్లు మూతపడ్డాయి. దీంతో వరుసగా రెండో సారీ ‘లవ్ స్టోరీ’ వాయిదా పడింది. లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే.. ఆగష్టులో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

.

RELATED ARTICLES

Most Popular

న్యూస్