Saturday, March 7, 2026
Homeసినిమాకటౌట్ .. కంటెంట్ రెండూ ఉన్న హీరోనే!  

కటౌట్ .. కంటెంట్ రెండూ ఉన్న హీరోనే!  

టాలీవుడ్ హీరోల్లో హ్యాండ్సమ్ అనిపించుకునేవారు కొంతమంది కనిపిస్తారు. అలాంటివారి జాబితాలో నాగశౌర్య ఒకరుగా కనిపిస్తాడు. ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా ఇండస్ట్రీకి వచ్చినవారిలో నాగశౌర్య ఒకరు. మంచి హైటూ .. అందుకు తగిన పర్సనాలిటీతో తొలి సినిమాలతోనే ఆకట్టుకున్నాడు. అందుకు తగినట్టుగానే ఆయనను విజయాలను వరిస్తూ వచ్చాయి. ఈ జనరేషన్ లో అమ్మాయిల వైపు నుంచి ఎక్కువ మార్కులు సంపాదించుకున్న హీరోగా నాగశౌర్యకి క్రేజ్ ఉంది.

సాధారణంగా ప్రేమకథా చిత్రాలలో ఎక్కువగా చూడాలని ప్రేక్షకులు కోరుకునే ఇమేజ్ కొంతమంది హీరోలకు మాత్రమే లభిస్తూ ఉంటుంది. అలాంటి హీరోల జాబితాలో నాగశౌర్య పేరు ముందు వరుసలోనే ఉంటుంది. అయితే నాగశౌర్య మాత్రం యాక్షన్ ఇమేజ్ కూడా కోరుకున్నాడు. ఈ విషయంలో ఆయన కాస్త తొందరపడ్డాడని అంటారు. ఎందుకంటే యాక్షన్ ఇమేజ్ కోసం ఆయన ఎంచుకున్న కథలు పెద్దగా కలిసి రాలేదు .. ఆడియన్స్ కి కనెక్ట్ కాలేదు.

అయితే యాక్షన్ ప్రధానమైన సినిమాలు సరిగ్గా ఆడకపోయినా, ఈ తరహా సినిమాలు కూడా తను బాగా చేయగలడు అని నిరూపించుకున్నాడు. ఈ మధ్య ఆయన చేసిన ‘రంగబలి’ హిట్ కావలసిన కంటెంట్ ఉన్న సినిమానే కానీ .. ఎందుకో అది సక్సెస్ కి దూరంగానే ఉండిపోయింది. ఆ తరువాత నాగశౌర్య ప్రాజెక్టులపై అప్ డేట్స్ రావడం లేదు. ఇండస్ట్రీలో హిట్టూ .. ఫ్లాప్ వెలుగు నీడల్లాంటివి.  వస్తూనే ఉంటాయి .. వెళ్లిపోతూనే ఉంటాయి. ప్రాజెక్టుల పరంగా గ్యాప్ రాకుండా చూసుకోవలసిన బాధ్యత నాగశౌర్యపైనే ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular