Sunday, January 19, 2025
Homeసినిమా'కృష్ణ వ్రింద విహారి' విడుద‌ల తేదీ ఖ‌రారు.

‘కృష్ణ వ్రింద విహారి’ విడుద‌ల తేదీ ఖ‌రారు.

Vihari on May 20th: నాగశౌర్య హీరోగా అనీష్‌ ఆర్‌ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం కృష్ణ వ్రింద విహారి. ఈ చిత్రాన్నిఐరా క్రియేషన్స్‌ పతాకం పై ప్రముఖ నిర్మాత ఉషా మూల్పూరి నిర్మించారు. ఇప్పటికే టీజర్, ఫస్ట్ సింగల్ తో ప్రేక్షకుల్లో అంచనాలు పెంచిన ఈ చిత్రం కొత్త విడుదల తేదీని చిత్ర యూనిట్ ప్రకటించింది. కృష్ణ వ్రింద విహారి సమ్మర్ రేసులోనే మే 20న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో నాగశౌర్య సూపర్ కూల్‌గా కనిపించారు.

ఇప్పటికే విడుదల చేసిన ఈ మూవీ టీజర్ కు అన్నివర్గాల ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభించింది. సినిమా ప్రమోషన్స్ జోరుగా కొనసాగుతున్నాయి. మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా విడుదలైన ఈ చిత్రంలో మొదటి పాట వర్షంలో వెన్నెల చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఈ పాటలో నాగ శౌర్య, షిర్లీ సెటియా కెమిస్ట్రీ ఆకట్టుకుంది. మహతి స్వరసాగర్‌ స్వర పరిచిన ఈ పాట వీక్షకులని అమితంగా అలరించింది.

డిఫరెంట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ ట్రైనర్ గా తెరకెక్కిన‌ ఈ చిత్రానికి సాయిశ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా, తమ్మిరాజు ఎడిటర్ గా పని చేస్తున్నారు. ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ రాధిక ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. స‌రైన స‌క్సెస్ కోసం ఎదురు చూస్తోన్న నాగ‌శౌర్య ఈ సినిమాతో ఆశించిన విజ‌యం సాధిస్తాడేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్