Saturday, March 14, 2026
Homeసినిమానాగ‌శౌర్య 'ల‌క్ష్య‌' నుండి ఫ్రైడే స్పెష‌ల్ పోస్ట‌ర్

నాగ‌శౌర్య ‘ల‌క్ష్య‌’ నుండి ఫ్రైడే స్పెష‌ల్ పోస్ట‌ర్

నాగశౌర్య హీరోగా ప్రాచీన విలువిద్య నేప‌థ్యంలో రూపొందుతోన్న చిత్రం ‘ల‌క్ష్య’. ధీరేంద్ర సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న ఈ మూవీలో ఇంత‌కు ముందెన్న‌డూ చూడ‌ని స‌రికొత్త‌ లుక్‌లో క‌నిపించనున్నారు నాగ‌శౌర్య‌, ఇది అతనికి 20వ సినిమా. సోనాలి నారంగ్ స‌మ‌ర్పణ‌లో శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి, నార్త్ స్టార్  ఎంటర్‌టైన్‌మెంట్‌ సంయుక్తంగా నారాయణదాస్ కె. నారంగ్‌, పుష్కర్ రామ్‌మోహన్‌రావు, శరత్‌ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నాగ‌‌శౌర్య స‌ర‌స‌న కేతిక శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో కీల‌క పాత్రల‌లో విలక్షణ న‌టులు జ‌గ‌ప‌తి బాబు న‌టిస్తున్నారు.

ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ ను ఇటీవ‌ల కిక్‌ స్టార్ట్ చేసి #LAKSHYASFRIDAY హ్యాష్ ట్యాగ్ పేరుతో ప్ర‌తీ శుక్ర‌వారం ల‌క్ష్య మూవీ నుండి ఒక కొత్త అప్డేట్ ఇస్తామని ప్రకటించారు. దీనిలో భాగంగా ఈ శుక్ర‌వారం నాగ‌శౌర్య‌, కేతిక శ‌ర్మ‌ల‌తో కూడిన ఒక స్పెష‌ల్ రొమాంటిక్ పోస్ట‌ర్ ను రిలీజ్ చేశారు మేక‌ర్స్‌. ఈ మూవీ చిత్రీక‌ర‌ణ ముగింపు ద‌శ‌లో ఉంది అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో జరుగుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular