Saturday, April 12, 2025
HomeTrending Newsతమ్మారెడ్డి వ్యాఖ్యలపై నాగబాబు, దర్శకేంద్రుడి కౌంటర్లు

తమ్మారెడ్డి వ్యాఖ్యలపై నాగబాబు, దర్శకేంద్రుడి కౌంటర్లు

RRR సినిమా యూనిట్ పై తమ్మారెడ్డి భరద్వాజ చేసిన వ్యాఖ్యలు సంచనలం సృష్టించిన సంగతి తెలిసిందే. ‘RRR టీం ఆస్కార్ ప్రమోషన్స్ కోసం 80 కోట్లు ఖర్చుపెడుతున్నారు. సూట్లు వేసుకొని, ఫ్లైట్స్ టికెట్స్ వేసుకొని డబ్బులు ఖర్చు చేస్తున్నారు. అదే 80 కోట్లు నాకు ఇస్తే ఎనిమిది సినిమాలు నిర్మించి ఇస్తా’నంటూ కామెంట్ చేశారు.

దీనిపై నటుడు, జనసేన నేత నాగబాబు ఘాటుగా స్పందించారు.

To Whomever It May Concern : “నీయమ్మ మొగుడు ఖర్చు పెట్టాడారా 80 కోట్లు R R R కి ఆస్కార్ కోసం” (#RRR మీద కామెంటుకు వై.సీ.పీ. వారి భాషలో సమాధానం) అంటూ ట్వీట్ చేశాడు.

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కూడా దీనిపై స్పందిస్తూ చురకలంటించారు.

“తెలుగు సినిమాకు, తెలుగు సాహిత్యానికి, తెలుగు దర్శకుడికి, తెలుగు నటులకి ప్రపంచ వేదికలపై మొదటి సారి వస్తున్న పేరుని చూసి గర్వపడాలి.. అంతే కానీ 80 కోట్ల ఖర్చు అంటూ చెప్పడానికి నీ దగ్గర అకౌంట్స్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా..?

జేమ్స్ కామెరూన్, స్పీల్ బర్గ్ వంటి వారు డబ్బు తీసుకొని మన సినిమా గొప్పతనాన్ని పొగుడుతున్నారని నీ ఉద్దేశమా ?” అంటూ ప్రశ్నించారు.

ఈ కామెంట్స్ – కౌంటర్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్