స్టార్ మా-ఎల్ అండ్ టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ సంయుక్తంగా ప్రభావవంతమైన పౌర స్పృహ ఆధారిత ప్రచారాన్ని బిగ్ బాస్ ద్వారా సృష్టించాయి. హైదరాబాద్ మెట్రో రైల్‌లో ప్రయాణించేటప్పుడు అనుసరించాల్సిన ముందు జాగ్రత్తలను గురించి అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రచారం ప్రారంభించారు.
ఈ పౌరస్పృహ కార్యక్రమాన్ని నగరంలోని 57 మెట్రో స్టేషన్‌లలోని కాన్‌కోర్స్, ఎంట్రీ–ఎగ్జిట్ మరియు చెక్ ఇన్ ప్రాంగణాలలో ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన జింగిల్స్ తో పాటుగా అదే తరహా సందేశాలను సైతం అన్ని మెట్రో రైళ్లలోనూ ప్రచారం చేస్తున్నారు. ఈ క్యాంపెయిన్‌ను మొత్తం బిగ్‌బాస్ సీజన్ 100 రోజులూ ప్రచారం చేయనున్నారు. తద్వారా మెట్రో కమ్యూటర్లు ప్రయాణ సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటుగా మెట్రో స్టేషన్ ప్రాంగణాలలో అనుసరించాల్సిన విధానాలను గురించి అవగాహన కల్పించనున్నారు. దీనిలో భాగంగా భద్రతా ప్రమాణాలు, మెట్రో నిబంధనలు, తమ సౌకర్యం కోసం సరైన విధానంలో మరింతగా వినియోగించడం వంటి అంశాల పట్ల అవగాహన కల్పించడం వంటివి తెలుపనున్నారు.
అక్కినేని నాగార్జున మాట్లాడుతూ “వినోదానికి ఓ సహేతుకమైన విధానమంటూ ఉండాలి. ఈ ప్రచారం ఆ విధానానికి చక్కటి ప్రాతినిధ్యం వహిస్తుంది. బిగ్ బాస్ అనేది పూర్తి వినోదాత్మక కార్యక్రమం. భావోద్వేగాలను తట్టి లేపుతుంది. ఈ ప్రచారం ద్వారా భద్రత పట్ల మరింత అవగాహన సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రయాణీకులకు చక్కటి విలువను జోడించనుంది. స్టార్ మా మరియు ఎల్‌టీఎంఆర్‌హెచ్‌ఎల్ ఈ తరహా సృజనాత్మక మరియు సామాజికంగా బాధ్యతాయుతమైన ప్రచారం కోసం ముందుకు రావడం సంతోషంగా ఉంది” అని అన్నారు.