Sunday, January 19, 2025
Homeసినిమాఅఖిల్ విష‌యంలో నిర్ణ‌యం మార్చుకున్న నాగ్?

అఖిల్ విష‌యంలో నిర్ణ‌యం మార్చుకున్న నాగ్?

హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన నాగార్జున తాజా చిత్రం ‘ది ఘోస్ట్’ దసరాకు విడుదలైనా…  పాజిటివ్ టాక్ ని రాబట్టలేకపోయింది. దీంతో నాగ్ జడ్జిమెంట్ పై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో అనుమానాలు మొదలయ్యాయి.  అక్కినేని అఖిల్ తో సురేందర్ రెడ్డి యాక్షన్ ఎంటర్ టైనర్ ఏజెంట్ మూవీని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో నాగార్జున చాలా వరకు ఇన్ వాల్వ్ అయ్యారట. చాలా  సన్నివేశాల్లో మార్పులు చేయించారట.

అయితే.. తనని వరుస ఫ్లాపులు వెంటాడుతున్న నేపథ్యంలో ‘ఏజెంట్‘ మూవీ విషయంలో దర్శకుడు సురేందర్ రెడ్డికి నాగార్జున ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారని ఇన్ సైడ్ టాక్. ఇదిలా వుంటే.. ఈ మూవీ తాజా షెడ్యూల్ ని బళ్లారి మైన్స్ లో ప్లాన్ చేశారు. అక్కడే క్లైమాక్స్ సన్నివేశాలను పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారట. ఇందు కోసం సురేందర్ రెడ్డి అండ్ టీమ్ బళ్లారి వెళ్లినట్టుగా తెలుస్తోంది. అఖిల్ ఈ మూవీ పై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ఈ సినిమాతో హీరోగా నెక్స్ట్ లెవెల్ కి వెళ్లాలన్నది అఖిల్ ఆలోచన. మ‌రి.. ఏజెంట్ అఖిల్ కి ఎలాంటి ఫ‌లితాన్ని అందిస్తుందో చూడాలి.

Also Read: ఏజెంట్ సినిమా ఇప్పట్లో వస్తుందా?

RELATED ARTICLES

Most Popular

న్యూస్