Sunday, March 15, 2026
Homeసినిమాదుబాయ్ లో ఘోస్ట్ షూటింగ్

దుబాయ్ లో ఘోస్ట్ షూటింగ్

Ghost gone to Dubai: టాలీవుడ్ కింగ్ నాగార్జున రీసెంట్ గా ‘బంగార్రాజు’తో బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించారు. ఈ సినిమా ఇచ్చిన విజ‌యోత్సాహంతో ‘ఘోస్ట్’ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ప్ర‌వీణ్ స‌త్తారు ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా ఈ సినిమా రూపొందుతోంది. ఆమ‌ధ్య రిలీజ్ చేసిన ఘోస్ట్ ఫ‌స్ట్ లుక్ కి అనూహ్య‌మైన స్పంద‌న వ‌చ్చింది. ఈపాటికే ఘోస్ట్ షూటింగ్ కంప్లీట్ అవ్వాలి. అయితే.. బంగార్రాజు ముందు రిలీజ్ చేయాల‌ని ఘోస్ట్ షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు.

ఇప్పుడు బంగార్రాజు రిలీజై  సక్సెస్ కావడంతో.. ‘ఘోస్ట్‘ లేటెస్ట్ షెడ్యూల్ దుబాయ్ లో స్టార్ట్ చేశారు. ఈ విష‌యాన్ని తెలియ‌చేస్తూ.. ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ స‌త్తారు ఘోస్ట్ వ‌ర్కింగ్ స్టిల్స్ సోష‌ల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్‌ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌ల పై నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దుబాయ్ షెడ్యూల్ కంప్లీట్ అయిన త‌ర్వాత రిలీజ్ ఎప్పుడు అనేది ప్ర‌క‌టిస్తార‌ని స‌మాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular