Friday, March 13, 2026
Homeసినిమా‘బంగార్రాజు’ రిలీజ్ చేసిన ‘అనుభవించు రాజా’ ట్రైలర్‌

‘బంగార్రాజు’ రిలీజ్ చేసిన ‘అనుభవించు రాజా’ ట్రైలర్‌

Nagarjuna Launched The Trailer Of Anubhavinchu Raja  :

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ ‘అనుభవించు రాజా’. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి సంయుక్తంగా నిర్మిస్తోంది. నవంబర్ 26న ఈ సినిమా విడుదల కాబోతోంది. తాజాగా కింగ్ నాగార్జున ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు.

‘రూపాయి పాపాయిలాంటిదిరా.. దాన్ని పెంచి పెద్దది చేసుకోవాలి కానీ ఎవడి చేతిలో పడితే వాడి చేతిలో పెట్టకూడదు’ అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. మొత్తం 115 సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్ లో రాజ్ తరుణ్ పాత్రలోని రెండు కోణాలను చూపించారు. సిటీలో సెక్యురిటీ గార్డ్, ఊర్లో జాలీగా ఎంజాయ్ చేసే బంగారం పాత్రలో రాజ్ తరుణ్ మెప్పించారు. ‘బంగారం గాడి లాంటి మనసు సినిమా హాల్ లాంటిది.. వారానికో సినిమా వస్తా ఉంటది.. పోతా ఉంటది.. ఏదీ పర్మినెంట్‌గా ఉండదు’ అని రాజ్ తరుణ్ చెప్పే డైలాగ్‌తో పాత్ర స్వరూపం ఏంటో అర్థమవుతుంది. ఈచిత్రంలో కశిష్ ఖాన్ టెక్కిగా పని చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ ట్రైలర్లో సినిమా ఎలా ఉండబోతోందో చూపించేశారు.

దర్శకుడు శ్రీను గవిరెడ్డి అద్బుతమైన కథకు, మంచి మాటలు రాసుకున్నట్టు కనిపిస్తోంది. ట్రైలర్‌లో ప్రొడక్షన్ వ్యాల్యూస్ హై స్టాండర్డ్స్‌ లో కనిపిస్తున్నాయి. నాగేష్ బానెల్ కెమెరావర్క్‌ తో ట్రైలర్ నిండుగా కనిపించింది. గోపీ సుందర్ ఇచ్చిన నేపథ్య సంగీతం మాస్ ఆడియెన్స్‌ ను మెప్పించేలా ఉంది. మొత్తంగా ఈ ట్రైలర్‌ ఆద్యంతం వినోదభరితంగా ఉంది. ట్రైలర్‌తో సినిమా మీద అంచనాలు పెంచేశారు.

నాగార్జున ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసి ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించారు. ఆ తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ టీజర్‌ను రిలీజ్ చేశారు. యువ సామ్రాట్ నాగ చైతన్య ఈ చిత్రంలోని టైటిల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఇక రెండో పాట ‘నీ వల్లే రా’ లిరికల్ వీడియోను హీరోయిన్ పూజా హెగ్డే విడుదల చేశారు. ప్రతీ ఒక్క ప్రమోషనల్ కంటెంట్‌కు విశేష స్పందన వచ్చింది. సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో రాజ్ తరుణ్ సరసన కశిష్ ఖాన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. గోపీ సుందర్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. నాగేష్ బానెల్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. పాటలు భాస్కరభట్ల రాయగా.. చోటా కే ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. నవంబర్ 26న ‘అనుభవించు రాజా’ థియేటర్లోకి రాబోతోంది.

Must Read :  ‘అనుభవించు రాజా’ రెండో పాట విడుదల చేసిన పూజా హెగ్డే

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular