Sunday, January 19, 2025
Homeసినిమాబ్ర‌హ్మ‌స్త్ర‌లో నాగ్ లుక్ అదుర్స్

బ్ర‌హ్మ‌స్త్ర‌లో నాగ్ లుక్ అదుర్స్

What a look! బాహుబలి స్ఫూర్తితో బాలీవుడ్ లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతోన్న భారీ చిత్రం బ్ర‌హ్మాస్త్ర‌. ఈ చిత్రానికి ఆయ‌న్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ర‌ణ్ బీర్ క‌పూర్, ఆలియా భ‌ట్ జంట‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్, టాలీవుడ్ కింగ్ నాగార్జున కీల‌క పాత్ర‌లు పోషిస్తుండ‌డం విశేషం. మూడు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతోంది. అందులో మొద‌టి భాగం సెప్టెంబ‌ర్ 9న వ‌ర‌ల్డ్ వైడ్ గా విడుద‌ల కానుంది.

బాలీవుడ్ లో రూపొందుతోన్న ఈ భారీ చిత్రానికి సౌత్ లో ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం విశేషం. ఇటీవలే ఈ మూవీ ప్రమోషన్స్ ని మోషన్ పోస్టర్ తో వైజాగ్ లో రాజమౌళి, రణ్ బీర్ కపూర్, దర్శకుడు అయాన్ ముఖర్జీ ప్రారంభించారు. అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ ని పరిచయం చేస్తూ ఓ మోషన్ పోస్టర్ ని విడుదల చేసిన మేకర్స్ తాజాగా కింగ్ నాగార్జున పాత్రని పరిచయం చేస్తూ ఓ పోస్ట‌ర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో నాగ్ పాత్ర పేరు ఆర్టిస్ట్ అనీష్ షెట్టి. 1000 నందుల పవర్ ఈ పాత్ర సొంతం.

బ్రహ్మాస్త్రలో పవర్ ఫుల్ నందీ అస్త్రం ఈ క్యారెక్టర్. పోస్టర్ లో నాగార్జున సీరియస్ లుక్ లో కనిపిస్తూ రైట్ హ్యాండ్ లో తన పవర్ కున్న శక్తిని ప్రదర్శిస్తున్న తీరు ఆకట్టుకుంటోంది. కుడిచేతికి వున్న కడియం నుంచి ఆకాశం వంక పవర్ జనరేట్ అవుతున్నట్టుగా చూపించారు. సినిమాలో నాగ్ క్యారెక్టర్ కున్న పవర్ ని ఆయన పాత్ర ప్రాముఖ్యతని తెలియ‌చేస్తోన్న‌ ఈ పోస్టర్ కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. దీంతో బ్ర‌హ్మ‌స్త్ర పై మ‌రింత ఆస‌క్తి ఏర్ప‌డింది.

Also Read : బ్ర‌హ్మాస్త్ర మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్