Sunday, February 23, 2025
Homeసినిమా‘ల‌డ్డుండా..’ అంటూ అద‌ర‌గొడుతున్న బంగార్రాజు

‘ల‌డ్డుండా..’ అంటూ అద‌ర‌గొడుతున్న బంగార్రాజు

Nagarjuna Mesmerizing With Laddunda Song In Bangarraju :

టాలీవుడ్ కింగ్ నాగార్జున, యువ స‌మ్రాట్ నాగచైతన్యల క్రేజీ కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ చిత్రం బంగార్రాజు. ‘సోగ్గాడే చిన్నినాయ‌నా’ చిత్రానికి ప్రీక్వెల్ గా రూపొందుతోన్న ఈ చిత్రానికి క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. నాగార్జున సరసన రమ్యకృష్ణ నటిస్తుండగా.. నాగచైతన్య స‌ర‌స‌న‌ ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి న‌టిస్తుంది. ఈ చిత్రం ప్ర‌స్తుతం మైసూర్ లో షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ క్రేజీ మూవీని సంక్రాంతికి విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. అందుక‌నే ప్ర‌మోష‌న్ స్టార్ట్ చేశారు.

ఈరోజు ఈ చిత్రం నుంచి “లడ్డుండా.. జువ్విచ్చి…” అంటూ సాగే లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. “కందిసేను కాడ.. డాంటక్కుడడన.. కన్ను కలిపితే డాంటక్కుడడన.. పంపు షెడ్డుకాడ… డాంటక్కుడడన.. పైట తగిలితే.. డాంటక్కుడడన..” అంటూ సాగే మాస్ సాంగ్ ను భాస్కర భట్ల రవికుమార్ రచించగా.. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఈ పాట‌ ప్రారంభంలో నాగార్జున పలికే మాస్ డైలాగ్స్ ఈ పాటకే హైలైట్స్ అని చెప్పొచ్చు. ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక్క మాట‌లో చెప్పాలంటే.. ఈ పాట అదిరిపోయింది.

Also Read :

పంచెకట్టు అందాన్ని పంచుతున్న ‘బంగార్రాజు’

RELATED ARTICLES

Most Popular

న్యూస్