Sunday, January 19, 2025
HomeసినిమాAkkineni Nagarjuna: నాగ్ 100వ సినిమా ఎవరితోనో?

Akkineni Nagarjuna: నాగ్ 100వ సినిమా ఎవరితోనో?

అక్కినేని నాగార్జున 100వ చిత్రం గురించి గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ.. ఎప్పుడు. ఎవరితో అనేది మాత్రం ప్రకటించలేదు.  ‘గాడ్ ఫాదర్’ డైరెక్టర్ మోహనరాజా తో ఉంటుందని, అఖిల్ ముఖ్యపాత్ర పోషించనున్నారని కూడా టాక్ వినిపించింది. అయితే.. ఇప్పుడు కింగ్  100వ చిత్రం ప్లానింగ్ మారిందని తెలిసింది.

మోహన్ రాజా స్టోరీ లైన్ చెప్పినప్పుడు బాగుంది కానీ ఫుల్ స్టోరీగా మార్చినప్పుడు మాత్రం అంత సంతృప్తికరంగా లేదట. అందునే ఈ మూవీ క్యాన్సిల్ అయ్యిందని సమాచారం. నాగార్జున కెరీర్ లోనే కాకుండా.. తెలుగు సినిమా చరిత్రలో మరచిపోలేని చిత్రాల్లో ఒకటి ‘మనం’. విక్రమ్ కుమార్ దీన్ని రూపొందించారు. నాగార్జున 100వ చిత్రం కోసం విక్రమ ఓ డిఫరెంట్ స్టోరీ రెడీ చేస్తున్నాడట. దీనితో పాటు ఓ కోలీవుడ్ డైరెక్టర్ కూడా ఓ కథను రెడీ చేస్తున్నారని తెలిసింది.

విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో కానీ.. కోలీవుడ్ డైరెక్టర్ తో కానీ ఈ నూరవ సినిమా ఉంటుందని ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. ప్రస్తుతం నాగార్జున ‘నా సామి రంగా’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంతో కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. సంక్రాంతికి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు ధనుష్ మూవీలో కీలక పాత్ర చేయడానికి ఓకే చెప్పారు. ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించనున్నారు. ఈ రెండు సినిమాల తర్వాత నాగ్ 100వ సినిమా ప్రకటిస్తారని సమాచారం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్