Sunday, January 19, 2025
Homeసినిమానాగార్జున '100'వ సినిమా ప్లాన్ మారిందా?

నాగార్జున ‘100’వ సినిమా ప్లాన్ మారిందా?

టాలీవుడ్ కింగ్ నాగార్జున ఇటీవ‌ల ‘ది ఘోస్ట్’ మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. ద‌స‌రాకు ఈ సినిమా భారీగా రిలీజైంది. ఈ సినిమా పై నాగార్జున‌ చాలా ఆశ‌లు పెట్టుకున్నారు. అయితే… హాలీవుడ్ రేంజ్ మూవీ అని పేరు తెచ్చుకుంది కానీ.. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మాత్రం క‌లెక్ష‌న్స్ ను రాబ‌ట్ట‌లేక‌పోయింది. ఓపెనింగ్ కూడా స‌రిగా రాక‌పోవ‌డంతో నాగార్జున ఆలోచ‌న‌లోప‌డ్డారు. నెక్ట్స్ చేయ‌బోయే సినిమాల పై సీరియ‌స్ గా ఆలోచిస్తున్నారట‌.

ఇదిలా వుంటే గత కొన్ని రోజులుగా నాగార్జున ‘వందవ’ సినిమా పై చర్చ జరుగుతోంది. ఆ ప్రచారం నిజమేనని నాగార్జునతో  మోహనరాజా సినిమా చేయ‌నున్నార‌ని గాడ్ ఫాదర్ నిర్మాతలలో ఒకరైన ఎన్వీ ప్రసాద్ ఇటీవల వెల్లడించడంతో పూర్తి క్లారిటీ వచ్చేసింది. అంతే కాకుండా దర్శకుడు మోహనరాజా కూడా ఇదే విషయం పై మరోసారి క్లారిటీ ఇచ్చారు. నాగార్జునతో చేయబోయే సినిమాకు స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తయిందని ఫైనల్ గా చెక్ చేసుకుని సినిమా ప్రారంభిస్తామని చెప్పారు.

ఇది నాగార్జున నటించనున్న ‘వందవ’ సినిమా. అయితే.. ఈ సినిమా విషయంలో నాగార్జున ప్లాన్ మారినట్టుగా తెలుస్తోంది. మూవీ కోసం ప్లాన్ ఏ, ప్లాన్ బీని ఫాలో అవ్వాలనుకుంటున్నారట. భారీ అంచనాలు పెట్టుకున్న ది ఘోస్ట్  ఫ్లాప్ కావడంతో నాగార్జున వందవ సినిమా విషయంలో జాగ్రత్త పడుతున్నారట. ముందే ప్రకటించేసి అంచనాలు పెంచ‌డం కంటే సినిమా పూర్తయి తనకు సూపర్ అనిపించిన తరువాతే ఇదే వందవ సినిమా అని ప్రకటించాలని నాగ్ భావిస్తున్నాడట. అయితే.. ప్ర‌చారంలో ఉన్న‌ది నిజ‌మేనా..?  కాదా..?  అనేది తెలియాల్సివుంది.

Also Read : మహేష్-రాజమౌళి మూవీలో నాగ్?

RELATED ARTICLES

Most Popular

న్యూస్