Saturday, January 18, 2025
Homeసినిమా‘ఓ పరి’ తెలుగు వర్షెన్‌ను లాంచ్ చేసిన నాగార్జున

‘ఓ పరి’ తెలుగు వర్షెన్‌ను లాంచ్ చేసిన నాగార్జున

టీ సీరిస్ అధినే భూషణ్ కుమార్.. మన రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్‌ను సరికొత్తగా చూపించారు. ఓ పరి అంటూ ప్రైవేట్ ఆల్బమ్‌ను హిందీలో రిలీజ్ చేశారు. ఈ పాటను రణ్‌వీర్ సింగ్ విడుదల చేయగా.. ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక ఇప్పుడు ఈ పాటను తెలుగు, తమిళ భాషల్లోనూ విడుదల చేశారు. తెలుగులో కింగ్ నాగార్జున, తమిళంలో యూనివర్సల్ హీరో కమల్ హాసన్ లు బిగ్ బాస్ స్టేజ్ మీద దేవీ శ్రీ ప్రసాద్ చేసిన ఈ పాటను రిలీజ్ చేసి అభినందించారు.

నాగార్జున మాట్లాడుతూ.. ‘దేవీశ్రీ ప్రసాద్ రాసి, పాడి, కంపోజ్ చేసిన ఓ పరి పాట హిందీలో అద్భుతమైన విజయం సాధించింది. ఇప్పుడు ఈ పాటను తెలుగులోనూ రిలీజ్ చేశారు. మన తెలుగు వారికి కూడా ఆ పాట కచ్చితంగా నచ్చుతుంది. దేవీ శ్రీ ప్రసాద్ ప్రతిభను చూస్తే నాకు ముచ్చటేస్తుంటుంది. ఇంత మంచి పాటను కంపోజ్ చేసినందుకు దేవీకి కంగ్రాట్స్’ అని అన్నారు.

దేవిశ్రీప్ర‌సాద్ మాట్లాడుతూ.. ‘‘నాగార్జున సర్, కమల్ హాసన్ సర్‌లకు థాంక్స్. నా ఈ కష్టంలో వారి సాయం ఎంతో విలువైంది. ఇంటర్నేషనల్ సాంగ్ చేయాలనే నా ఆలోచనను ముందు కమల్ హాసన్ సర్‌తోనే పంచుకున్నాను. ఆయన ఇచ్చిన సలహాలు, సూచనలతోనే ఈ పాటను పూర్తి చేయగలిగాను. ఆయనకు సంగీతం మీదున్న మక్కువ, నాలెడ్జ్ వల్లే మేం ఇద్దరం ఇంత సన్నిహితంగా మారిపోయాం. అందుకే ఈ పాటను ఆయనే రిలీజ్ చేయాలని నేను కోరుకున్నాను” అని అన్నారు.

‘ఓపరి’ పాటకు హిందీలో మంచి రెస్పాన్స్ వచ్చింది. నాగార్జున, కమల్ హాసన్ వంటి వారు తెలుగు, తమిళ భాషల్లో ఈ పాటను రిలీజ్ చేయడంతో మరింత మందికి రీచ్ అయి అద్భుతమైన స్పందన లభిస్తుందని నిర్మాతలు భావిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్