Saturday, January 18, 2025
Homeసినిమాసంక్రాంతి సెంటిమెంటుతో ఉన్న నాగ్!

సంక్రాంతి సెంటిమెంటుతో ఉన్న నాగ్!

అక్కినేని ఫ్యామిలీకి మొదటి నుంచి కూడా సంక్రాంతి సెంటిమెంటు ఉంది. ఏఎన్నార్ గ్రామీణ నేపథ్యంలోని కథలతో ఎన్నో సినిమాలు చేశారు. విలేజ్ కంటెంట్ తో వచ్చిన ఆయన సినిమాలు  కొన్ని సంక్రాంతికి విడుదలై, భారీ విజయాలను అందుకున్నాయి. ఏఎన్నార్ నుంచి రొమాంటిక్ హీరోగా వారసత్వాన్ని అందుకున్న నాగార్జున కూడా గ్రామీణ నేపథ్యంలో కథలను చేస్తూనే వస్తున్నాడు. రొమాంటిక్ హీరోగా తన జోరును ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నాడు.

ఆ మధ్య నాగార్జున ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమా చేయగా, అది ఆయన కెరియర్లోనే అత్యధిక వసూళ్లను అందుకుంది. సంక్రాంతికి విడుదలైన ఆ సినిమాలో పల్లెటూరి బుల్లోడుగా నాగార్జున చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఆ సినిమాలో ఆయన పోషించిన ‘బంగార్రాజు’ పాత్రకి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఆ పాత్ర పేరునే టైటిల్ గా పెట్టుకుని, మరో సంక్రాంతికి మళ్లీ హిట్ కొట్టాడు. ఆ తరువాత నాగార్జున వేరే కంటెంట్ తో చేసిన సినిమాలు ఆశించినస్థాయిలో అభిమానుల అంచనాలను అందుకోలేకపోయాయి.

ఈ నేపథ్యంలో మరోసారి గ్రామీణ నేపథ్యంలో మాస్ కంటెంట్ ను నాగార్జున ఎంచుకున్నాడు. ప్రసన్నకుమార్ బెజవాడ కథను అందించిన ఈ సినిమా, ‘నా సామిరంగ‘ టైటిల్ తో రూపొందుతోంది. ఈ సినిమాకి విజయ్ బిన్నీ దర్శకత్వం వహిస్తున్నాడు. డిఫరెంట్ లుక్ తో నాగార్జున కనిపించనున్న ఈ సినిమాను, వచ్చే సంక్రాంతికి బరిలోకి దింపుతున్నారు. సంక్రాంతి సెంటిమెంట్ కారణంగా ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ కావడం ఖాయమనే నమ్మకంతో ఫ్యాన్స్ ఉన్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో!

RELATED ARTICLES

Most Popular

న్యూస్