Friday, May 16, 2025
HomeTrending Newsకేస్లాపూర్‌లో నాగోబా విగ్రహ ప్రతిష్టాపన..

కేస్లాపూర్‌లో నాగోబా విగ్రహ ప్రతిష్టాపన..

ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో నూతనంగా నిర్మించిన ఆలయంలో నాగోబా విగ్రహాన్ని పునఃప్రతిష్టించారు. ఆదివారం ఉదయం మెస్రం వంశీయులు నాగోబా విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్టించారు. అనంతరం తమ ఆరాధ్య దేవునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉమ్మడి జిల్లాల నుంచి వేలాదిగా తరలివచ్చిన మెస్రం వంశీయులు, ఎమెల్యే కోనేరు కోనప్ప, ఆసిఫాబాద్‌ జడ్పీ చైర్మన్‌ ఈ కార్మక్రమంలో పాల్గొన్నారు.

మెస్రం వంశీయులు తొలినాళ్లలో నాగోబా దేవత వెలిసిన పుణ్య స్థలం (పుట్ట)ను మాత్రమే పూజించేవారు. 1956లో గడ్డి పరకలతో చిన్న గుడిసెను నిర్మించి పూజించారు. అనంతరం 1995లో సిమెంట్‌, ఇటుకలతో చిన్న మందిరాన్ని నిర్మించి పూజలు చేశారు. 2000 సంవత్సరంలో ప్రభుత్వ సహకారంతో గుడిని నిర్మించారు. ప్రస్తుతం శిలలతో నూతన ఆలయాన్ని నిర్మించారు. పుష్య మాసంలో మెస్రం వంశీయులు నిర్మించే నాగోబా జాతర రాష్ట్రంలో రెండో అతిపెద్ద గిరిజన జాతర.

RELATED ARTICLES

Most Popular

న్యూస్