Friday, March 13, 2026
Homeసినిమామోక్షజ్ఞ సినిమాకు టైటిల్ ఫిక్స్...

మోక్షజ్ఞ సినిమాకు టైటిల్ ఫిక్స్…

నందమూరి బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నందమూరి అభిమానులకు సంతోషం కలిగించే వార్తను బాలకృష్ణ చెప్పారు. ఆదిత్య 369 సినిమా సీక్వెల్ కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యింది. ప్రస్తుతం దాన్ని ఇంకా డెవలప్ చేస్తున్నాం. 2022 లో సెట్స్ మీదకు వెళుతుంది. ఈ సినిమాకు ‘ఆదిత్య 999 మ్యాక్స్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశాం. దర్శకుడిని ఇంకా ఫిక్స్ చేయలేదు అని నందమూరి బాలకృష్ణ చెప్పారు. ఈ సినిమాకు దర్శకత్వం నందమూరి బాలకృష్ణనే వహిస్తారా? లేక సింగీతం శ్రీనివాసరావు వహిస్తారా? అనేది తెలియాల్సి వుంది.

అయితే.. మోక్షజ్ఞ ఎంట్రీ నభూతో న భవిష్యత్ అన్నట్టు వుండాలనే సినిమా ప్రారంభం ఆలస్యమవుతోందని బాలయ్య సన్నిహితులు చెబుతున్నారు. ఇందులో సూపర్ హీరోగా మోక్షజ్ఞ నటించనున్నారు. అందుకు తగ్గట్టు ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయి. ఈ సినిమా 2022 లో విడుదల అయ్యే అవకాశాలున్నాయి అని టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైనా ఈ వార్త మాత్రం నందమూరి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. అయితే.. ఈ క్రేజీ మూవీని ఎవరు నిర్మిస్తారు? ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుంది? అనేది క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular