Saturday, January 18, 2025
Homeసినిమాఅభిమానులకు బాలయ్య సందేశం.

అభిమానులకు బాలయ్య సందేశం.

జూన్ 10 నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు. ప్రతి సంవత్సరం బాలయ్య పుట్టినరోజున అభిమానులు తరలి వచ్చి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తుంటారు. ఈ సంవత్సరం కూడా తమ అభిమాన హీరో పుట్టినరోజును గ్రాండ్ గా నిర్వహించాలి అనుకున్నారు. అయితే.. కరోనా వలన పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలిసిందే. ఈ సందర్భంగా బాలయ్య అభిమానులకు తన సందేశాన్ని ఫేస్ బుక్ ద్వారా తెలియచేశారు.

“నా ప్రాణ సమానులైన అభిమానులకు.. ప్రతిఏటా జూన్ 10 వతేదీ నాపుట్టినరోజు నాడు నన్ను కలిసేందుకు నలుదిక్కులనుండీ తరలివస్తున్న మీ అభిమానానికి సర్వదా విధేయుడ్నికానీ.. కరోనా విలయతాండవం చేస్తున్న ఈ విపత్కర పరిస్థితుల్లో మీరు రావటం అభిలషణీయం కాదు. నన్నింతటివాడ్ని చేసింది మీ అభిమానం
..ఒక్క అభిమాని దూరమైనా నేను భరించలేను. మీ అభిమానాన్ని మించిన ఆశీస్సు లేదు. మీ ఆరోగ్యాన్ని మించిన శుభాకాంక్ష లేదు. మీ కుటుంబంతో మీరు ఆనందంగా గడపటమే నా జన్మదినవేడుక. దయచేసి రావద్దని మరీ మరీ తెలియజేస్తూ .. ఈ విపత్కాలంలో అసువులు బాసిన నా అభిమానులకూ కార్యకర్తలకూ అభాగ్యులందరికీ నివాళులర్పిస్తూ .. మీ నందమూరి బాలకృష్ణ” అంటూ సందేశం ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్