Saturday, March 14, 2026
HomeTrending Newsసంక్రాంతి సంబరాల్లో బాలయ్య

సంక్రాంతి సంబరాల్లో బాలయ్య

ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ భార్య వసుంధర, కుమారుడు మోక్షజ్ఞ తో కలసి ప్రకాశం జిల్లా కారంచేడులో సంక్రాంతి సంబరాలను తమ కుటుంబ సభ్యులతో  వైభవంగా జరుపుకుంటున్నారు. కారంచేడులో బిజెపి జాతీయ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఇంటి వద్ద సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ ఏడాది సంక్రాంతి పండగకు బాలకృష్ణ కారంచేడులోని సోదరి దగ్గుబాటి పురందేశ్వరి ఇంట్లో సందడి చేశారు.

బాలయ్య తన భార్య వసుంధర, కొడుకు మోక్షజ్ఞ, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి వేడుకల్లో సరదాగా గడిపారు. బాలకృష్ణ నాచ్ ఘోడ గుర్రమెక్కి కొద్దిసేపు కుటుంబసభ్యులను అలరించారు. ఆ తర్వాత బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ గుర్రం ఎక్కగా.. బాలకృష్ణ గుర్రం కళ్ళెం పట్టుకుని అదుపుచేశారు. బాలకృష్ణ కుటుంబాన్ని చూసేందుకు భారీగా అభిమానులు చుట్టుపక్క గ్రామాల నుండి తరలి వచ్చారు. ఈ వేడుకల్లో లోకేశ్వరి, ఉమామహేశ్వరి సహా బంధువులు పాల్గొన్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular