Saturday, January 18, 2025
Homeసినిమాఆదిత్య 369 సీక్వెల్ లో మోక్షజ్ఞ

ఆదిత్య 369 సీక్వెల్ లో మోక్షజ్ఞ

నందమూరి నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తొలి సినిమా గురించి గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే.. మోక్షజ్ఞ ఎంట్రీ గురించి బాలయ్యను అడిగిన ప్రతిసారి సమయం వచ్చినప్పుడు ప్రకటిస్తానని చెప్పేవారు. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన ఇంటర్ వ్యూలో మోక్షజ్ఞ సినీరంగ ప్రవేశం గురించి క్లారిటీ ఇచ్చారు. ఆదిత్య 369 సీక్వెల్ ద్వారా తన కుమారుడు మోక్షజ్ఞ సినిమా రంగంలో ప్రవేశించనున్నాడని చెప్పారు. తన కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు తండ్రితో కలిసి నటించానని.. ఆయన ద్వారా ఎంతో నేర్చుకున్నాను.

అలాగే తన కుమారుడు తొలి సినిమాలో కూడా తనతో పాటు కలిసి నటిస్తాడని.. తనకున్న అనుభవంతో నటనలో మెళకువలు నేర్పిస్తానన్నారు. ఈ సినిమాకి కథను తనే రాశానని చెప్పారు. ఈ కథ గురించి సింగీతం శ్రీనివాసరావుకు చెబితే.. ఈ కథకు ఆయన కానీ.. లేదా నేను కానీ.. దర్శకత్వం వహిస్తేనే న్యాయం చేయగలమని చెప్పినట్టు బాలకృష్ణ తెలియచేశారు. మొత్తానికి బాలయ్య తన పుట్టినరోజు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి క్లారిటీ ఇచ్చారు. మరి.. బాలయ్య -మోక్షజ్ఞ కలిసి నటించే ఈ క్రేజీ మూవీ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్లనుందో క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్