Saturday, January 18, 2025
Homeసినిమాబాలయ్య ఏం చెప్పబోతున్నారు?

బాలయ్య ఏం చెప్పబోతున్నారు?

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతోన్న అఖండ మూవీని ఎన్టీఆర్ జయంతి సందర్భంగా  మే 28న రిలీజ్ చేయాలనుకున్నారు కానీ.. కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ కంప్లీట్ కాకపోవడం.. థియేటర్లు మూతపడడంతో విడుదల వాయిదా పడింది. అయితే.. అఖండ మూవీకి సంబంధించిన అప్ డేట్ ఏదైనా అప్ డేట్ మే 28న వస్తుందా అని నందమూరి అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ఇదిలా ఉంటే.. మే 28న తన తండ్రి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా సర్ ఫ్రైజ్ ఎనౌన్స్ మెంట్ ఉందని.. దీని గురించి రేపు (మే 27న) ఉదయం 8.45 నిమిషాలకు ప్రకటించనున్నట్టు తెలియచేస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ఎన్.బి.కె ఫిల్మ్స్ స్మాల్ సర్ ఫ్రైజ్ అని ప్రకటించారు. బాలయ్య నిర్మాణ రంగంలోకి ప్రవేశించి.. ఎన్.బి.కె ఫిల్మ్స్ బ్యానర్ పై ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు అనే సినిమాలు నిర్మించారు. ఇప్పుడు ఈ సంస్థ నుంచి ఎనౌన్స్ మెంట్ అని తెలియచేయడంతో ఈ బ్యానర్ లో బాలయ్య చేయబోయే సినిమా గురించి ఎనౌన్స్ చేస్తారా..? లేక తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ప్రకటిస్తారా..? అనేది ఆసక్తిగా మారింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్