Sunday, January 19, 2025
HomeసినిమాSai Dharam Tej: మెగా హీరోకు అభినందించిన నందమూరి హీరో

Sai Dharam Tej: మెగా హీరోకు అభినందించిన నందమూరి హీరో

సాయిధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘విరూపాక్ష’. ఈ చిత్రానికి కార్తీక్ దండు దర్శకత్వం వహించారు. సుకుమార్ ఈ చిత్రానికి స్ర్కీన్ ప్లే అందించడం విశేషం. ఈ థ్రిల్లర్ మూవీకి ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే హిట్ టాక్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్ సీస్ లో కూడా రికార్డ్ స్థాయి కలెక్షన్స్ వసూలు చేస్తుంది.తేజ్ కు సరైన టైమ్ లో సరైన సక్సెస్ రావడంతో మెగా ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఫీలవుతుంది. నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం 50 కోట్ల క్లబ్ లో చేరడం విశేషం. ప్రస్తుతం 60 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఓవర్ సీస్ లో అయితే 1 మిలియన్ మార్క్ క్రాస్ చేసింది.

ఈ చిత్రం విజయం సాధించిన సందర్భంగా చిరంజీవి, పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా తేజ్ ను అభినందించారు. అయితే.. ఇప్పుడు ఈ మెగా హీరోను కళ్యాణ్ రామ్ అభినందించడం విశేషం.  ఈ సందర్భంగా కళ్యాణ్ రామ్ కు తేజ్ థ్యాంక్యూ సో మచ్ అన్నా అంటూ రిప్లై ఇచ్చాడు. సంయుక్త మీనన్ బింబిసార సినిమాలో కళ్యాణ్ రామ్ కు జంటగా నటించింది. ఈ సినిమా చూసి కళ్యాణ్ రామ్ అభినందించడంతో చాలా ఎమోషనల్ గా ఫీలైంది. తన స్పందనను సోషల్ మీడియాలో తెలియచేసింది.

సంయుక్త మీనన్ ప్రస్తుతం కళ్యాణ్ రామ్ తో కలిసి ‘డెవిల్’ అనే సినిమా చేస్తుంది. ఈ అమ్మడు నటించిన బింబిసార, భీమ్లా నాయక్, సార్, విరూపాక్ష చిత్రాలు సక్సెస్ అవ్వడంతో గోల్డెన్ లెగ్ అనే ట్యాగ్ వచ్చింది. ఇప్పుడు డెవిల్ లో నటిస్తుంది. ఈ సినిమా కూడా సెంటిమెంట్ ప్రకారం బిగ్ సక్సెస్ అవుతుందని టాక్ వినిపిస్తుంది.  విరూపాక్ష మూవీ కలెక్షన్స్ రోజురోజుకు పెరుగుతున్నాయి. సాయిధరమ్ తేజ్ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా విరూపాక్ష నిలిచింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్