Friday, October 18, 2024
Homeసినిమాక‌ళ్యాణ్ రామ్ కోరిక నెరవేరేనా?

క‌ళ్యాణ్ రామ్ కోరిక నెరవేరేనా?

Bimbisara: నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ బింబిసార‌. గతంలో అల్లు అర్జున్‌ తో బన్నీ, మాస్ మహారాజ రవితేజతో భగీరథ సినిమాలను నిర్మించిన మల్లిడి సత్యనారాయణ తనయుడు వశిష్ట్ ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఎప్ప‌టి నుంచో ఈ మూవీ నిర్మాణంలో ఉంది. దీంతో నంద‌మూరి అభిమానులు బింబిసార కోసం ఎదురు చూస్తున్నారుక‌థ విష‌యానికి వ‌స్తే..  క్రీస్తుపూర్వం 500 వ శతాబ్ద సమయంలో మగధదేశ రాజు భట్టియా కుమారుడైన బింబిసారుడి జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. చారిత్రక నేపథ్యంతో పాటు ఇటు సోషల్ జానర్‌లోనూ సాగనున్న బింబిసార సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం పై కె హరికృష్ణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. కళ్యాణ్ రామ్ కెరీర్‌లో మొదటి పాన్ ఇండియా సినిమా కావడం విశేషం.

ఇప్పటికే రిలీజైన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ అభిమానులను, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ని జులై 4న విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు తాజాగా చిత్ర యూనిట్ అఫిషియ‌ల్ గా అనౌన్స్ చేసింది. ఈ మూవీ టీజ‌ర్ ఇంట్ర‌స్టింగ్ గా ఉండ‌డంతో సామాన్య ప్రేక్ష‌కుల్లో సైతం బింబిసార పై ఇంట్ర‌స్ట్ క్రియేట్ అయ్యింది. క‌ళ్యాణ్ రామ్ స‌రైన స‌క్సెస్ కోసం ఎప్ప‌టి నుంచో వెయిట్ చేస్తున్నారు. మ‌రి.. క‌ళ్యాణ్ రామ్ ఆశించిన స‌క్సెస్ ను బింబిసార అందిస్తుందో లేదో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్