Friday, November 22, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్అన్ని వర్సిటీల్లో భాషా సదస్సులు

అన్ని వర్సిటీల్లో భాషా సదస్సులు

తెలుగు అకాడమిని తెలుగు & సంస్కృత అకాడమి గా పేరు మార్చటం తప్పులేదని తెలుగు & సంస్కృత అకాడమి ఛైర్మెన్ డా” నందమూరి లక్ష్మీపార్వతి పునరుద్ఘాటించారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో తెలుగు & సంస్కృత అకాడమీ  బాషా చైతన్య సదస్సు జరిగింది. ఈ సదస్సుకు లక్ష్మీ పార్వతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నాగార్జున యూనివర్సిటీ రెక్టార్ వరప్రసాదమూర్తి, ప్రొఫెసర్లు, మేధావులు పాల్గొన్నారు.

నందమూరి లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ

  • తెలుగు భాషమీద గౌరవం పెంపొందించేలా  సంసృత బాష అనుసంధానంగా  బాషా చైతన్య సదస్సుని నిర్వహిస్తున్నాం
  • తెలుగు భాష సంస్కృత భాష నుంచే మమేకమైనదని అందరు గమనించాలి.
  • గత ప్రభుత్వంలో చంద్రబాబు  తెలుగు అకాడమీని పూర్తిగా నిర్వీర్యం చేశారు
  • గత ప్రభుత్వంలో పాఠ్యపుస్తకాల ముద్రణను  నారాయణ సంస్థలకు అప్పజెప్పటం అవి బ్లాక్ మార్కెట్ చేయటంతో విద్యార్థులు నష్టపోయారు
  • వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తెలుగు అకాడమీకి  పూర్వ వైభవం వచ్చింది
  • తిరుపతి లో తెలుగు &సంసృతం అకాడమీ భవనం నెలకొల్పారు
  • పాఠ్యపుస్తకాల ముద్రణను చేపట్టాం
  • విద్యార్థులకు సకాలంలో పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి

భాషాభివృద్ధి లక్ష్యంతో బాషా చైతన్య సదస్సులను రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో నిర్వహిస్తామని ఆమె వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్