Sunday, September 22, 2024
Homeసినిమామోక్ష‌జ్ఞ ఎంట్రీకి డైరెక్ట‌ర్ ఫిక్స్?

మోక్ష‌జ్ఞ ఎంట్రీకి డైరెక్ట‌ర్ ఫిక్స్?

Date Fixed: నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ,  న‌టవార‌సుడు మోక్ష‌జ్ఞ ఎంట్రీ గురించి గ‌త కొంత‌కాలంగా వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి కానీ..  అఫిషియ‌ల్ అనౌన్స్ మెంట్ మాత్రం రావ‌డంలేదు. దీంతో నంద‌మూరి అభిమానులు ఎప్పుడెప్పుడు మోక్ష‌జ్ఞ ఎంట్రీ ఉంటుందా అని ఈగ‌ర్ గా వెయిట్ చేస్తున్నారు. బాల‌య్య‌ను ఎప్పుడు అడిగినా స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు త‌ప్ప‌కుండా నేనే ప్ర‌క‌టిస్తాన‌ని చెబుతున్నారు.

అయితే… జూన్ 10 బాల‌య్య పుట్టిన‌రోజు.  అదేరోజు మోక్ష‌జ్ఞ ఎంట్రీ గురించి అనౌన్స్ మెంట్ ఉంటుంద‌ని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. దీంతో బాల‌య్య అభిమానులు జూన్ 10 కోసం ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు. అయితే.. మోక్ష‌జ్ఞ ఎంట్రీ ఎవ‌రి డైరెక్ష‌న్ లో ఉంటుంది అంటే.. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ పేరు వినిపిస్తోంది. పూరి ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో లైగ‌ర్ మూవీ చేస్తున్నారు.

ఈ సినిమా ఈ సంవ‌త్స‌రం ఆగ‌ష్టులో విడుద‌ల కానుంది. ఈ సినిమా త‌ర్వాత కూడా పూరి విజ‌య్ తోనే సినిమా చేస్తున్నారు. అదే.. జ‌న‌గ‌ణ‌మ‌న. ఈ సినిమాను వ‌చ్చే సంవ‌త్స‌రం రిలీజ్ చేయ‌నున్నారు. ఈలోపు మోక్ష‌జ్ఞ ఫిజిక‌ల్ గా సినిమా చేయ‌డానికి రెడీ అవుతాడ‌ని అంటున్నారు సినీ జ‌నాలు. మ‌రి ప్ర‌చారంలో ఉన్న‌ట్టుగా పూరి డైరెక్ష‌న్ లోనే మోక్ష‌జ్ఞ ఎంట్రీ ఉంటుందా..?  లేక వేరే డైరెక్ట‌ర్ తో ఉంటుందా..? అనే తెలియాల్సివుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్