Sunday, January 19, 2025
HomeTrending NewsYSRCP: ఎస్సీల మధ్య విభేదాలకు టిడిపి యత్నం: నందిగం

YSRCP: ఎస్సీల మధ్య విభేదాలకు టిడిపి యత్నం: నందిగం

ఆర్ 5 జోన్ లో ఇళ్ళ నిర్మాణాలపై కేంద్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేస్తే చంద్రబాబుకు, ఎల్లో మీడియాకు కడుపు మంటగా ఉందని బాపట్ల ఎంపి నందిగం సురేష్ వ్యాఖ్యానించారు. ‘ఇళ్లు హడావుడిగా కట్టాల్సిన అవసరం ఏముందని… కేంద్రం ఎందుకు హడావుడిగా అనుమతులిచ్చిందని’ ఈనాడు పత్రిక రాసిందన్నారు. పేదవాడు బాగుపడుతుంటే చంద్రబాబు ఏడుస్తుంటాడని విమర్శించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సురేష్ మీడియాతో మాట్లాడారు.

చంద్రబాబు ఏమీ చేయకపోయినా ఆయన గురించి  గొప్పగా రాస్తారని, తమ ప్రభుత్వంపై మాత్రం లేనిపోని అబద్ధాలన్నీ వండి వారుస్తున్నారని దుయ్యబట్టారు. అమరావతి రాజధానిలో పేదలకు ఇళ్లిస్తే రూ.750 కోట్లు కృష్ణలో పోసినట్లు అంటూ రాయడం శోచనీయమన్నారు.

ఎస్సీలకు తమ ప్రభుత్వంలో ఏం జరిగింది..చంద్రబాబు హయాంలో ఏం కీడు జరిగిందో చర్చిద్దామని సవాల్ విసిరారు.  “చంద్రబాబును నమ్ముకున్న వ్యక్తి ఏ ఒక్కడైనా బాగుపడ్డాడో చూపించండి. జగన్‌ ని నమ్ముకున్న వ్యక్తి ఎవరు మోసపోయారో చూపించండి.. చంద్రబాబుతో నేను చర్చకు సిద్ధం..ఆయన చర్చకు వస్తే ఇదే సీఆర్‌డీఏ ప్రాంతంలో ఎస్సీలను ఏ రకంగా అవమానపరిచాడో వివరిస్తా” అంటూ సురేష్ ఛాలెంజ్ చేశారు. ఎస్సీలంతా జగన్‌ వెంట ఉన్నారు కాబట్టి ఏదో ఒక రకంగా వారి మధ్య గొడవలు పెట్టి, వాటిని తమపై రుద్ది లబ్ధిపొందాలని చూస్తున్నారని ఆరోపించారు.

అమరావతి ప్రాంతంలో చంద్రబాబు దాయాదులు పేదల్ని, దళితుల్ని భయపెట్టి భూములు కొనుగోలు చేసి ఆ డాక్యుమెంట్లు దాచుకున్నారని, అవి ఇప్పటికీ బయటకు రావడం లేదంటే ఎవరికి ఎస్సీలపై ప్రేమ ఉన్నట్టని ప్రశ్నించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్