Sunday, January 19, 2025
HomeసినిమాNani: నాని, త్రివిక్రమ్ కాంబో మూవీ..?

Nani: నాని, త్రివిక్రమ్ కాంబో మూవీ..?

నాని, త్రివిక్రమ్ శ్రీనివాస్.. వీరిద్దరూ కలిసి సినిమా చేస్తారని గతంలో వార్తలు వచ్చాయి. అయితే.. ఏమైందో ఏమో కానీ.. ఇప్పటి వరకు ప్రాజెక్ట్ సెట్ కాలేదు. హీరో నాని అంటే.. మన పక్కంటి అబ్బాయ్ లా ఉంటాడు. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్.. బంధాలు, అనుబంధాలు అంటూ మన కథలనే తెర పై ఆవిష్కరిస్తుంటారు. అందర్నీ ఆకట్టుకుంటుంటారు. ఇక వీరిద్దరూ కలిసి సినిమా చేస్తే… ఆ సినిమాకు మరింత క్రేజ్ రావడం ఖాయం. అయితే.. గతంలో ప్రచారంలో ఉన్న ఈ క్రేజీ కాంబో మూవీ మరోసారి వార్తల్లోకి వచ్చింది.

ఇంతకీ విషయం ఏంటంటే.. నాని నటించిన తాజా చిత్రం ‘దసరా‘. ఈ చిత్రానికి నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వం వహించారు. పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రాన్ని భారీగా రూపొందించడం.. నాని ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడంతో దసరా చిత్రం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. నానికి జంటగా కీర్తి సురేష్ నటించింది. మార్చి 30న దసరా చిత్రాన్ని భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. అయితే.. దసరా చిత్రాన్ని తెలుగులోనే కాకుండా మిగిలిన భాషల్లో కూడా బాగా ప్రమోట్ చేస్తున్నాడు నాని.

ఇలా దసరా ప్రమోషన్స్ లో నానికి.. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా గురించి ప్రశ్న ఎదురైంది. దీనికి నాని ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు. త్రివిక్రమ్, తన కోసం కథ రాస్తున్నాడనేది నాని చెప్పిన సమాధానం. ఇంకా ఏమన్నాడంటే.. త్రివిక్రమ్ నా కోసం కథ రాస్తున్నారని నేను అనుకుంటున్నాను. నాతో సినిమా చేస్తానని ఓ సందర్భంలో త్రివిక్రమ్ అన్నారు. మేమిద్దరం కలిస్తే గ్రేట్ కాంబినేషన్ అవుతుంది. ఒక టైమ్ లో మల్టీస్టారర్ చేద్దామని కూడా అనుకున్నాం. అయితే.. ఇప్పటి వరకు కాంబినేషన్ సెట్ అవ్వలేదు. ఒకవేళ త్రివిక్రమ్ తో సినిమా చేస్తే మాత్రం అది మెమొరబుల్ మూవీ అవుతుంది అని నాని చెప్పాడు. మరి.. నిజంగా నాని, త్రివిక్రమ్ కాంబో సెట్ అవుతుందేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్