Sunday, January 19, 2025
Homeసినిమానాని మళ్లీ అదే తప్పు చేస్తున్నాడా..?

నాని మళ్లీ అదే తప్పు చేస్తున్నాడా..?

నాని కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి విభిన్న కథా చిత్రాలు చేస్తూ.. ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్నాడు. అలాగే కథ బాగుందనిపిస్తే చాలు.. ఆ దర్శకుడు కొత్తవాడా..? సక్సెస్ ఉందా..? లేదా అనేది చూడకుండా అవకాశాలు ఇస్తుంటాడు. మాస్ మూవీ ‘దసరా’తో సక్సెస్ సాధించిన నాని.. క్లాస్ మూవీ ‘హాయ్ నాన్న’ అంటూ వస్తున్నాడు. డిసెంబర్ 7న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే.. నాని కొత్త చిత్రం ‘సరిపోదా శనివారం’  సినీ ప్రముఖుల సమక్షంలో ప్రారంభమైంది.

ఈ చిత్రానికి దర్శకుడు వివేక్ ఆత్రేయ. గతంలో నాని, వివేక్ ఆత్రేయ కలిసి ‘అంటే.. సుందరానికి’చేశారు. ఇది బాక్సాఫీస్ దగ్గర ఫరవాలేదనిపించింది కానీ.. కమర్షియల్ సక్సెస్ సాధించలేదు. అయినప్పటికీ వివేక్ ఆత్రేయతో మరో సినిమాకు నాని ఓకే చెప్పడం విశేషం. అయితే.. వివేక్ ఈసారి సాఫ్ట్ స్టోరీ కాకుండా భారీ యాక్షన్ మూవీ చేయాలని ఫిక్స్ అయ్యాడు. అంతే కాకుండా స్టోరీ కూడా డిఫరెంట్ గా ప్లాన్ చేశాడు. ఇదే.. ఆలోచనలో పడేసింది. వివేక్ ఈ భారీ మాస్ యాక్షన్ మూవీని డీల్ చేయగలడా? లేదా? అనే డౌట్ స్టార్ట్ అయ్యింది.

గతంలో కూడా నాని సాఫ్ట్ లవ్ స్టోరీస్ చేసే శివ నిర్వాణతో ‘టక్ జగదీష్’ అనే మాస్ యాక్షన్ మూవీ చేశాడు. ఆ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు కూడా అలాగే సాఫ్ట్ స్టోరీస్ చేసే వివేక్ ఆత్రేయతో మాస్ మూవీ చేస్తుండడంతో నాని మళ్లీ అదే తప్పు చేస్తున్నాడనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే ‘సరిపోదా శనివారం’ గ్లింప్స్ కు మాత్రం పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మరి నాని నమ్మకం నిజమౌతుందో లేదో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్