Sunday, January 19, 2025
Homeసినిమాహాయ్ నాన్న తమిళ మూవీకి రీమేకా..?

హాయ్ నాన్న తమిళ మూవీకి రీమేకా..?

నాని నటించిన తాజా చిత్రం ‘హాయ్ నాన్న’. ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు శౌర్యవ్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో నానికి జంటగా మృణాల్ ఠాగూర్ నటించింది. సమ్మర్ లో దసరా అంటూ ఊర మాస్ మూవీతో వచ్చిన నాని.. ఇప్పుడు వింటర్ లో హాయ్ నాన్న అంటూ క్లాస్ మూవీతో వస్తుండడం విశేషం. ఇది ఫాదర్ – డాటర్ నేపథ్యంలో సాగే విభిన్న కథా చిత్రం. ఈ మూవీ పోస్టర్స్ అండ్ సాంగ్, టీజర్ చూస్తుంటే.. ఇది రెగ్యులర్ మూవీ కాదు.. కాస్త భిన్నమైన కథ ఏదో ఉందనే ఫీలింగ్ కలిగిస్తోంది. టీజర్ రిలీజ్ చేసిన తర్వాత అయితే… సినిమా పై మరికాస్త ఆసక్తి పెరిగింది.

అయితే.. ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసిన తర్వాత కోలీవుడ్ మీడియాలో హాయ్ నాన్న రీమేక్ అంటూ ప్రచారం మొదలైంది. ఇంతకీ.. ఏ సినిమాకి రీమేక్ అంటే.. తమిళ కామెడీ చిత్రం దాదా సినిమాకి ఇది రీమేక్ అంటూ వార్తలు వస్తున్నాయి. హాయ్ నాన్న, దాదా మూవీ పోస్టర్స్ మధ్య పోలికలు ఉండడాన్ని  హైలెట్ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీంతో హాయ్ నాన్న.. నిజంగానే రీమేకా..? లేక ప్రచారంలో ఉన్నది పుకారా..? అనేది ఆసక్తిగా మారింది. ఇప్పుడు హాయ్ నాన్న మూవీ రీమేకా..? కాదా..? అనేది మేకర్స్ క్లారిటీ ఇవ్వాలి.

ఈ చిత్రానికి హేషమ్‌ అబ్దుల్‌ వహబ్‌ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన సాంగ్ అండ్ టీజర్ కు మ్యూజిక్ బాగా సెట్ అయ్యిందనే పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. డిసెంబర్ 7న ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. అయితే.. రెండు పోస్టర్స్ మధ్య పోలికలు ఉన్నత మాత్రానా రీమేక్ అనలేం. చూడాలి మరి.. నాని ప్రచారంలో ఉన్న వార్తల పై ఎలా రియాక్ట్ అవుతారో..?

RELATED ARTICLES

Most Popular

న్యూస్