Sunday, January 19, 2025
HomeTrending Newsకార్యకర్తలకు ధైర్యం చెబుతోన్న భువనేశ్వరి

కార్యకర్తలకు ధైర్యం చెబుతోన్న భువనేశ్వరి

చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక  మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శిచేందుకు నారా భువనేశ్వరి చేపట్టిన “నిజం గెలవాలి” బస్సుయాత్ర నేడు మొదలైంది.  నిన్న తిరుమల శ్రీవారిని దర్శించుకొని స్వగ్రామం నారావారి పల్లె చేరుకున్న ఆమె అక్కడ తమ పూర్వీకుల సమాధులను దర్శించుకున్నారు. అనంతరం స్థానిక నాగ దేవత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఉదయం నారావారిపల్లెలో తండ్రి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాన వేసి ఆశీస్సులు అందుకుని చంద్రగిరికి వెళ్ళారు. ఈ నెల 17 వ తేదీన చనిపోయిన ప్రవీణ్ రెడ్డి కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు. అంతకుముందు నేండ్రగుంట లో చిన్నబ్బ కుటుంబాన్ని కూడా ఆమె కలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు రూ.3 లక్షల రూపాయల చెక్ లను అందించి ధైర్యం చెప్పారు.

భువనేశ్వరి వెంట టిడిపి సీనియర్ నేత కావలి ప్రతిభా భారతి,  మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత, పులివర్తి నాని తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్