Wednesday, March 11, 2026
HomeTrending Newsకుప్పం ఘటనపై లోకేష్ ఆగ్రహం

కుప్పం ఘటనపై లోకేష్ ఆగ్రహం

కుప్పంలో నేడు చోటు చేసుకున్న ఘటనలపై తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఈ సందర్భంగా సిఎం జగన్ పై  పరుష పదజాలంతో విరుచుకు పడ్డారు.

“జగన్ రెడ్డి కుప్పంలో ఎన్ని కుప్పి గంతులు వేసినా చివరికి భంగపాటు తప్పదు. పేదవాళ్ల నోటి కాడ ముద్ద లాక్కునే మూర్ఖపు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. ఆయన పేదవాళ్లకు అన్నం పెట్టడు ఇతరులను పెట్టనివ్వడు. రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్ల పై వైసిపి మూకలు దాడులు చేస్తూనే ఉన్నారు.  ఈ రోజు కుప్పంలో చంద్రబాబు గారు ప్రారంభించబోయే అన్న క్యాంటీన్ ను వైసిపి గూండాలు ధ్వంసం చెయ్యడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. నీ రౌడీయిజం పులివెందులలో చూపించుకో.. కుప్పంలో కాదు జగన్ రెడ్డి. కుప్పం జోలికి వస్తే వైసిపి అల్లరిమూకల తాటతీస్తాం” అంటూ సామాజిక మాధ్యమాల్లో  హెచ్చరించారు.

Also Read : కుప్పంలో తీవ్ర ఉద్రిక్తత 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular