Sunday, January 19, 2025
HomeTrending Newsడ్రగ్స్ లో ద్వారంపూడి పాత్ర : లోకేష్

డ్రగ్స్ లో ద్వారంపూడి పాత్ర : లోకేష్

డ్రగ్స్ వ్యవహారంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల చేసిన ఆరోపణలను టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఖండించారు. డ్రగ్స్ వెనుక ఉన్న బిగ్ బాస్ ఎవరని ప్రశ్నిస్తే సజ్జల ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

తన తండ్రి నారా చంద్రబాబు నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక్క కేసైనా ఉందా అంటూ నిలదీశారు. రెండున్నరేళ్ల వైసీపీ పాలనలో తనపై కక్ష కట్టి మరీ పెట్టిన ట్రాక్టర్ ర్యాష్ డ్రైవింగ్ కేసు తప్పించి,  వైసీపీ ఆరోపించిన వాటిలో ఒక్క రూపాయి అయినా అవినీతి, అక్రమాలు నిరూపించగలిగారా? అంటూ లోకేష్ సవాల్ విసిరారు.

ప్రజల ఆరోగ్యం కాపాడే పాలు, పెరుగు, మజ్జిగ , నెయ్యి వ్యాపారం తాము చేస్తున్నామని, జనం ప్రాణాలు తీసి..లక్షల కుటుంబాలకు విషాదాన్ని మిగిల్చే హెరాయిన్, గంజాయి, ప్రాణాంతక మద్యం మాఫియాలు మీరు చేస్తున్నారంటూ తీవ్రంగా ఆరోపించారు.

తాను దుబాయ్ లో కుటుంబసభ్యులతో వున్నానని, తన పర్యటనపైనా,  మీ బినామీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సీక్రెట్ గా వెళ్లిన డ్రగ్స్ హెవెన్ ఐవరీ కోస్ట్ టూర్ పైనా కేంద్ర సంస్థల దర్యాప్తుకి సిద్ధమా?  అని ఛాలెంజ్ విసిరారు

RELATED ARTICLES

Most Popular

న్యూస్