We also rejected: చంద్రబాబు ప్రభుత్వం పెగాసస్ స్పైవేర్ ను కొనుగోలు చేసిందంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలను తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ ఖండించారు. తాము కొని ఉంటే జగన్ ప్రభుత్వం ఇప్పటి వరకూ ఈ అంశంపై చూస్తూ ఊరుకునేదా అని ప్రశ్నించారు.
చంద్రబాబు ప్రభుత్వం ఈ స్పైవేర్ ను కొనుగోలు చేయలేదని నాటి డిజిపి గౌతమ్ సావాంగ్ చెప్పారని టిడిపి సేనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడు వెల్లడించారు. తాను సమాచార హక్కు చట్టం ద్వారా వివరణ కోరానని అంటూ తనకు వచ్చిన సమాధానాన్ని అయ్యన్న బైటపెట్టారు.
నాలుగేళ్ల క్రితం పెగాసస్ సాఫ్ట్ వేర్ సృష్టికర్తలు తమ రాష్ట్రానికి వచ్చి 25 కోట్ల రూపాయలకు స్పై వేర్ ను అందిస్తామని చెప్పారని, ఆ విషయం తెలిసిన తాను వద్దని తేల్చి చెప్పానని మమతా బెనర్జీ అసెంబ్లీలో స్వయంగా వెల్లడించారు. ఈ విషయం సంచలనంగా మారింది. బాబు హయాంలో ఇంటలిజెన్స్ డైరెక్టర్ జనరల్ గా వ్యవహరించిన ఏబీ వెంకటేశ్వరరావు ఇజ్రాయెల్ వెళ్ళారని, ఈ పరికరాలు కొనుగోలు చేసేందుకే అయన అక్కడకు వెళ్ళారని, నాటి విపక్షం, నేటి అధికార పక్షం వైఎస్సార్సీపీ చేసిన ఆరోపణలకు మమత వ్యాఖ్యలతో బలం చేకూరినట్లయింది.
అయితే లోకేష్ ఈ ఆరోపణలను తప్పుబట్టారు. వారు తమను కూడా సంప్రదించిన మాట వాస్తవమేనని, కానీ తాము కూడా కొనుగోలు చేయబోమని వారికి చెప్పామని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి: ఎవరికీ రక్షణ లేదు: చంద్రబాబు