Sunday, January 19, 2025
HomeTrending Newsమా దీక్ష‌ని పక్కదారి పట్టించేందుకే: లోకేశ్

మా దీక్ష‌ని పక్కదారి పట్టించేందుకే: లోకేశ్

క‌రోనా బాధితుల డిమాండ్ల సాధ‌న‌కు తెలుగుదేశం పార్టీ అధ్వర్యంలో చేపట్టిన సాధన దీక్ష‌ని పక్కదారి పట్టించేందుకే ఇవాళ ముఖ్యమంత్రి జగన్ దిశా యాప్ కార్యక్రమం పెట్టుకున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. 2020లో దిశ చట్టం కేంద్రానికి పంపితే ఇంతవరకూ ఆమోదం పొందలేదని, దిశ యాప్ గతంలోనే ఆరంభించారని, కానీ మరోసారి ఇవాళ ఈ కార్యక్రమం పెట్టుకోవడంలో ఔచిత్యం ఏమిటని లోకేష్ సూటిగా ప్రశ్నించారు.
సొంత అక్కాచెల్లెళ్లు ష‌ర్మిల‌, సునీత‌ల‌కే న్యాయం చేయలేని సిఎం జగన్ రాష్ట్రంలో మహిళలకు భద్రత ఎలా కల్పిస్తారని లోకేష్ నిలదీశారు. రాష్ట్రంలో మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోయింద‌ని, ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టేలా జ‌గ‌న్ చ‌ర్య‌లు ఉన్నాయ‌ని  విమ‌ర్శ‌లు గుప్పించారు.

త‌న‌ ఇంటి సమీపంలో గ్యాంగ్ రేప్ జ‌రిగి 10 రోజుల‌వుతున్నా నిందితుల్ని ప‌ట్టుకోని వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం.. దిశ యాప్ డౌన్‌లోడ్ నెపంతో సొంత‌ప‌త్రిక‌కు కోట్ల రూపాయ‌ల ప్ర‌క‌ట‌న‌లిచ్చారంటూ దుయ్యబట్టారు. ‘అక్కచెల్లెమ్మ‌ల భ‌ద్ర‌త‌-జ‌గ‌న‌న్న ప్ర‌భుత్వ బాధ్య‌త‌` అంటూ ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చుకున్నారని లోకేష్ ఎద్దేవా చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్