Sunday, January 19, 2025
HomeTrending Newsప్రజా ధనం దోపిడీ : లోకేష్ ఫైర్

ప్రజా ధనం దోపిడీ : లోకేష్ ఫైర్

Its ridiculous: గ్రామ వాలంటీర్లకు దినపత్రిక అలవెన్స్  కింద ప్రతి నెలా రెండువందల రూపాయలు ఇవ్వాలన్న ప్రభుత్వ  నిర్ణయంపై  టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. వాలంటీర్లను పార్టీ పనికోసం వాడుకోవడమే కాకుండా వారికి ప్రజా దానం ధారపోయడం దారుణమన్నారు.మంచి పడ్డారు.  ఈ మేరకు నేటి డిన పత్రికలో వచ్చిన వార్త క్లిప్పింగ్ ను షేర్ చేస్తూ ప్రభుత్వంపై మండిపడ్డారు.

“మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు అనే రకం జగన్ మోసపు రెడ్డి. జనం సొమ్ము దోపిడీకి ఆడని జగన్ నాటకం లేదు. వైసీపీ కార్యకర్తలందరినీ వలంటీర్లుగా పెట్టుకుని పార్టీ కోసం పనిచేయిస్తూ ప్రజాధనం ధారపోస్తున్నారు.

వైసీపీ కార్యకర్తలైన వలంటీర్లకి రూ.233 కోట్లతో సెల్ ఫోన్లు కొనిచ్చారు. ఇప్పుడు జనం సొమ్ము సొంతానికి ఎలా వాడుకోవాలనే అత్యాశతో మరో జగన్ ఆర్డర్ తెచ్చారు. ఖజానాలో డబ్బులు లేవని ప్రజాసంక్షేమ పథకాలు ఆపేసిన ప్రభుత్వం రూ.300 కోట్లు సాక్షికి ప్రకటనలు ఇచ్చింది.

అక్కడితో ఆగకుండా రాష్ట్ర వ్యాప్తంగా వలంటీర్లు సంక్షేమ కార్యక్రమాల గురించి తెలుసుకోవాలంటే సాక్షి వేయించుకోవాలని నెలకి రూ.5.32 కోట్లు జగన్ ఆర్డర్ ఇచ్చేశారు. అంటే ఏడాదికి 63.84 కోట్లు. జనం సొమ్ము జలగలా పీల్చేస్తున్న జగన్ జనానికి ఎదురొచ్చినా…జనమే ఎదురెళ్లినా జనానికే రిస్కు.” అంటూ ట్వీట్ చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్