Monday, November 25, 2024
HomeTrending Newsనాడు ఓటు, ఇప్పుడు దానితోనే ఉరి: లోకేష్

నాడు ఓటు, ఇప్పుడు దానితోనే ఉరి: లోకేష్

వైఎస్ జగన్ ఇచ్చిన హామీతో ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో ఫ్యాన్ గుర్తుకు ఓటేసిన యువత ఇప్పుడు అదే ఫ్యాన్ కు ఉరేసుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యాఖ్యానించారు.

ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన క్యాలండర్ ను సవరించి తాజా జాబ్ క్యాలండర్ ను వెంటనే విడుదల చేయాలని లోకేష్ డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ ఆత్మహత్యల ప్రదేశ్ గా మారిపోయిందని లోకేష్ విమర్శించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డ యువత ఇప్పుడు అదే ఫ్యాన్ కి ఉరేసుకుని ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అయన మండిపడ్డారు

“కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం ఎర్రకోట గ్రామానికి చెందిన యువకుడు వీరాంజనేయులు ప్రభుత్వ ఉద్యోగం రాలేదని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న ఘటన కలచివేసింది. ట్రిపుల్ ఐటీలో సీటు సాధించి సరస్వతీ పుత్రుడు అనిపించుకున్న యువకుడు జగన్ రెడ్డి మోసానికి బలైపోవడం బాధాకరం. వీరాంజనేయులు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. ఇంకో యువకుడు ఇలాంటి నిర్ణయం తీసుకోకుండా ప్రభుత్వం తక్షణమే ఫేక్ క్యాలెండర్ రద్దు చేసి 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చెయ్యాలి. యువకులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు పోరాడి ఉద్యోగాలు సాధిద్దాం” అంటూ ట్విట్టర్ లో లోకేష్ యువతకు పిలుపు ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్