Thursday, March 12, 2026
HomeTrending News‘యువ గళం’ పేరుతో లోకేష్ పాదయాత్ర

‘యువ గళం’ పేరుతో లోకేష్ పాదయాత్ర

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్   కొత్త సంవత్సరం జనవరి 27నుంచి పాదయాత్ర మొదలు పెట్టనున్నారు. తన తండ్రి, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తోన్న కుప్పం నియోజకవర్గం నుంచి ఆరోజు ఉదయం 11 గంటలకు యాత్ర మొదలు కానుంది. దీనికి ‘యువ గళం’ అని నామకరణం చేశారు.  ఈ పోస్టర్ ను మంగళగిరి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆవిష్కరించారు.

హంగూ, ఆర్భాటం లేకుండా యాత్ర ఏర్పాట్లు  ఉండాలని  పార్టీ నేతలకు లోకేష్ సూచించారు. దాదాపు 400 రోజులపాటు సాగనున్న ఈ యాత్రలో మొత్తం 100 నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. మొత్తం నాలుగు వేల కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular