Saturday, January 18, 2025
Homeసినిమాఆకట్టుకుంటున్న ‘నార‌ప్ప’ సాంగ్

ఆకట్టుకుంటున్న ‘నార‌ప్ప’ సాంగ్

విక్ట‌రీ వెంక‌టేష్ హీరోగా, ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల రూపొందించిన `నార‌ప్ప‌’ సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మించారు. విభిన్న తరహా పాత్రలు చేయడంలో మొదటి నుండీ ముందుండే జాతీయ ఉత్తమ నటి ప్రియమణి ఈ మూవీలో నార‌ప్ప భార్య `సుందరమ్మ`గా తెలుగు వారికి చాలా రోజులు గుర్తుండిపోయే పాత్ర చేస్తున్నారు. మెలొడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ స్వ‌రాలు స‌మ‌కూర్చిన ఈ చిత్రం నుండి ఫ‌స్ట్ సింగిల్ ‘చలాకీ చిన్న‌మ్మీ’ విడుద‌లైంది.

వెంకటేష్ ఫ్యామిలీ అంతా కలిసి తన కొడుకు పెళ్లి చూపులకు వెళ్లే నేప‌థ్యంలో వ‌చ్చే పాట ఇది. కార్తీక్ రత్నం ఈ చిత్రంలో వెంకటేష్ కొడుకుగా నటించిన విష‌యం తెలిసిందే. ఈ ఫ్యామిలీ పాట‌కు చిన్న రొమాంటిక్ ట‌చ్‌ని కూడా క‌లిపి మెలొడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ అద్భుత‌మైన ట్యూన్ కంపోజ్ చేశారు. ఆదిత్య అయ్యంగార్‌, నూత‌న మోహ‌న్ శ్రావ్యంగా ఆల‌పించిన ఈ పాట‌కు అనంత శ్రీ‌రామ్ మంచి సాహిత్యాన్ని అందించారు. ఇటీవ‌ల సురేష్ ప్రొడ‌క్ష‌న్ వారు ఎస్పీ మ్యూజిక్ లేబుల్‌ని ప్రారంభించిన విష‌యం తెలిసిందే. అందులో మొద‌టి సినిమాగా `నార‌ప్ప` సాంగ్స్ విడుద‌ల‌వుతున్నాయి. ఎస్పీ మ్యూజిక్ లేబుల్ వారు మ్యూజిక‌ల్ ప్ర‌మోష‌న్స్ స్టార్ట్ చేయ‌డానికి ఇది ప‌ర్‌ఫెక్ట్ సాంగ్ అని చెప్పొచ్చు.

ఈ మూవీలో డిఫ‌రెంట్‌ షేడ్స్ ఉన్న స‌రికొత్త పాత్రల‌లో విక్ట‌రి వెంకటేష్ కనిపించనున్నారు. అలాగే త‌న అద్భుతమైన నటనతో ప్రేక్ష‌కుల్ని మెప్పించ‌నున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్ కు మంచి స్పందన లభిస్తోంది. `నారప్ప` వెంకటేష్‌కు మరో భారీ బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశం ఉంది. ఇప్ప‌టికే షూటింగ్, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను ముగిశాయి. ఈ నెల 20న నారప్ప ఓటీటీలో రిలీజ్ కానుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్