Tuesday, February 25, 2025
HomeTrending Newsవైసీపీకి శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా

వైసీపీకి శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా

పల్నాడు జిల్లా నరసరావుపేట లోక్ సభ సభ్యత్వానికి, వైఎస్సార్ కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి లావు శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా చేశారు. నేడు గుంటూరులో జరిగిన మీడియా సమావేశంలో ఈ నిర్ణయాన్ని ఆయన ప్రకటించారు. పల్నాడు ప్రజలను తనను ఎంతో ఆదరించారని, గత ఎన్నికలలో మంచి మెజారిటీ తో పార్లమెంట్ పంపించారని, తానూ వంతుగా పల్నాడు ప్రాంత అభివృద్ధి కు కృషి చేశానని వ్యాఖ్యానించారు.

గత 15 రోజులుగా తన విషయంలో రాజకీయంగా ఎంతో అనిశ్చితి నెలకొని ఉందని, ఇది తాను కోరుకున్నది కాదని, దీనికి తాను బాధ్యుడిని కూడా కాదని ఆయన స్పష్టం చేశారు.  నరసరావుపేటకు కొత్త అభ్యర్ధిని తీసుకురావాలని అనుకున్నారని, దానివల్ల పార్టీ శ్రేణుల్లో కూడా అయోమయం నెలకొని ఉందని, దీనివల్ల పార్టీకి, తనకూ ఎలాంటి  ఉపయోగం లేదని… ఈ అనిశ్చితికి తెరదించాలనే ఈ నిర్ణయానికి వచ్చానని వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్