Thursday, March 12, 2026
HomeTrending Newsమేమూ రెడీ : ధూళిపాళ్ళ

మేమూ రెడీ : ధూళిపాళ్ళ

Come on: అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు తమపై దాడులకు పాల్పడితే తాము కూడా తిరగబడతామని టిడిపి సీనియర్ నేత ధూళిపాళ్ళ నరేంద్ర హెచ్చరించారు.  గుంటూరు జిల్లా పెదకాకాని మండలం అనుమర్లపూడిలో స్థానిక వైసీపీ నేతలు అక్రమంగా మట్టి తవ్వకాలు చేస్తున్నారని ఆరోపిస్తూ ఆ ప్రాంతాన్ని పరిశీలించేందుకు నరేంద్ర, టిడిపి నేతలతో కలిసి అక్కడకు వెళ్ళారు. మట్టి తవ్వకాలు పరిశీలిస్తున్న సమయంలో స్థానిక వైసీపీ నేతలు, కార్యకర్తలు టిడిపి బృందాన్ని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇరు వర్గాలకు మధ్య జరిగిన దాడిలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. నరేంద్ర వాహనంపై కూడా రాళ్ళు రువ్వడంతో అద్దాలు పగిలాయి. ఈ సందర్భంగా  అధికార పార్టీపై ధూళిపాళ్ళ మండిపడ్డారు, అసలు రాష్ట్రంలో పాలన అనేది ఉందా అని ప్రశ్నించారు.

అధికార పార్టీ నేతలు ఇష్టానుసారం మట్టి తవ్వకాలు చేస్తున్నారని,  దీనిపై ప్రశ్నిస్తున్న టిడిపి నేతలు, మీడియాపై దాడులకు తెగబడుతున్నారని ఆరోపించారు. పంచాయతీ అనుమతి ఉందంటూ పెద్ద మొత్తంలో మట్టిని తవ్వుతున్నారని,  ఎంపీపీ స్థానిక వైసీపీ నేతలు ఈ అక్రమాలకు పాలడుతున్నారని నరేంద్ర విమర్శించారు.

Also Read : మేమూ రెడీ : ధూళిపాళ్ళ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular