Wednesday, September 25, 2024
HomeTrending Newsకేంద్రానికి దాసోహం: నరేంద్ర విమర్శ

కేంద్రానికి దాసోహం: నరేంద్ర విమర్శ

No Bharosa: రైతు భరోసా పేరుతో జగన్ ప్రభుత్వం ఇతర పథకాలను వ్యవసాయదారులకు ఆపేసిందని టిడిపి సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు.  దేశంలో రైతులు అత్యధిక రుణభారంతో ఉన్న రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ అని దుయ్యబట్టారు. తెలుగుదేశం కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో నరేంద్ర మీడియాతో మాట్లాడారు.  ఉచిత విద్యుత్ ను ఈ ప్రభుత్వం ఎత్తివేస్తుందనే అనుమానాన్నిఅయన వ్యక్తం చేశారు. వ్యవసాయ మీటర్లకు  మోటార్లు పెట్టేది లేదని తెలంగాణా ప్రభుత్వం స్పష్టంగా చెబితే మన రాష్ట్రం మాత్రం ఇప్పటికే ఒక జిల్లాలో ఈ విధానం పూర్తి చేసిందని ధ్వజమెత్తారు. రైతుల మెడపై కత్తి పెట్టి మరీ మీటర్లు విగిస్తున్నారని, జగన్ ప్రభుత్వం కేంద్రానికి దాసోహమైందని నరేంద్ర ఘాటుగా వ్యాఖ్యానించారు.

వైఎస్సార్ రైతు భరోసాను ఎన్నికల హామీగా ప్రకటించే నాటికి పిఎం కిసాన్ యోజన పథకం లేదని, ఆ తర్వాత ఈ పథకం నుంచి వస్తున్న డబ్బులు కూడా తమ ఖతాలోనే కలుపుకొని రైతుకు అధికంగా ఇస్తున్నామని డబ్బాలు కొట్టుకుంటున్నారని  నరేంద్ర విమర్శించారు. కానీ వారు ప్రకటించిన 12,500 రూపాయల్లో కేవలం 7500 మాత్రమే ఇస్తున్నారని.. దీని ద్వారా  ఒక్కో రైతుకు ఏడాదికి ఐదు వేల రూపాయలు చొప్పున ఐదేళ్ళలో 25వేలు, 50లక్షలమంది రైతులకు 12,500 కోట్ల రూపాయలు ఇవ్వకుండా మోసం చేశారని ఆరోపించారు.

రాష్ట్రంలో 15 లక్షల మంది కౌలు రైతులు ఉంటే కేవలం లక్షా25 వేల మందికి మాత్రమే రైతు భరోసా ఇస్తున్నారని…. రాష్ట్రంలో 65 లక్షల మంది రైతులు ఉంటే, రకరకాల ఆంక్షలు విధించి ఆ సంఖ్యను 45 లక్షలకు కుదించారని నరేంద్ర వివరించారు. పక్క రాష్ట్రంలో వ్యవసాయం చేసే ప్రతి రైతుకు ఇస్తుంటే ఇక్కడ కోత పెట్టారన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్